Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
స్టార్ క్రికెటర్ రచిన్ ఇంటికి పిలిపించి నరదిష్టి తీసిన నాయనమ్మ, మోదీ అయినా దిష్టి మామూలే
భారతదేశంలో దశాభ్దాలుగా వస్తున్న కొన్ని సంప్రధాయాలు ఉన్నాయి. ఎవరైనా ఉన్నత స్థాయికి వస్తున్నారంటే వాళ్ల మీద నరదిష్టి పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎంతటి గొప్ప వాళ్లు అయినా సరే దిష్టి తీసుకుంటున్నారని చాలా సందర్బాల్లో వెలుగు చూసింది.
టాటా బిర్లాలు, అంబానీతో సహా హిందూ సాంప్రధాయాలు గౌరవించే చాలా మంది దిష్టి తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం విదేశాలకు వెళ్లి తిరిగి భారత్ వచ్చిన సందర్బాల్లో, అనేక రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్లి ప్రచారం చేసే సమయంలో మహిళలు ఆయనకు దిష్టి తీసిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

భారతదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆ క్రేజ్ కు మనం లెక్క కట్టలేము, లెక్కలు వెయ్యలేము. భారత క్రికెట్ సభ్యులు క్రికెట్ మ్యాచ్ లు ఆడటానికి స్టార్ హోటల్స్ కు వెళ్లే సందర్బంలో హోటల్ ఎంట్రన్స్ లో అక్కడి మహిళా సిబ్బంది దిష్టి తీసి హోటల్ లోకి ఆహ్వానించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ దర్శనం ఇస్తున్నాయి. ఇప్పుడు అలాంటి యువ క్రికెటర్ కు అతని కుటుంబ సభ్యులు నరదిష్టి తియ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో దూసుకుపోతున్న భారత్ మూలాలు ఉన్న యువ ఆటగాడు రచిన్ రవీంద్ర. 2023 వన్ డే వరల్డ్ క్రికెట్ కప్ మ్యాచ్ లో ఆడుతున్న యువ ప్రతిభావంతుడు సచిన్ రవీంద్ర. ఇప్పటికే 9 మ్యాచ్ లు ఆడిన రచిన్ రవీంద్ర టోర్నీలో పరుగుల మోతమోగిస్తున్నాడు. 9 మ్యాచ్ ల్లో మూడు సెంచరీలు, రెండు అర్దసెంచరీల సాధించిన రచిన్ రవీంద్ర మొత్తం 565 పరులు చేశాడు. న్యూజిలాండ్ టీమ్ లో రచిన్ రవీంద్ర అతనికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
1996 వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ 523 పరుగలు చేశాడు. అయితే 2023 వరల్డ్ కప్ లో ఆడుతున్న రచిన్ రవీంద్ర సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి ఏకంగా 565 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర తండ్రి రవి క్రిష్ణమూర్తి సొంత ఊరు బెంగళూరు. రవి క్రిష్ణమూర్తి తల్లిదండ్రులు బెంగళూరులో పుట్టి అక్కడే నివాసం ఉంటున్నారు. రవి క్రిష్ణమూర్తి తండ్రి బాలక్రిష్ణ అడిగ ఓ గొప్ప విద్యావేత్త. రచిన్ రవీంద్ర తాతయ్య, నాయనమ్మలు బెంగళూరులోనే ఉంటున్నారు.

వరల్డ్ కప్ ఆడుతున్న రచిన్ రవీంద్ర చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వచ్చాడు. బెంగళూరులో మ్యాచ్ పూర్తి అయిన తరువాత రచిన్ రవీంద్ర అతని తాత బాలక్రిష్ణ అడిగ ఇంటికి బయలుదేరాడు. బెంగళూరులోని తాతయ్య, నాయనమ్మ ఇంటికి రచిన్ రవీంద్ర వెళ్లాడు. వరల్డ్ కప్ లో ఆడుతున్న మనుమడు రచిన్ రవీంద్ర మంచి స్కోర్ సాదిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడని, అతనికి నరదిష్టి తగులుతుందని అనుకున్న నాయనమ్మ అతనికి దిష్టి తీశారు.
ఇంటికి వచ్చిన మనుమడు రచిన్ రవీంద్రను కుర్చోబెట్టి హిందూ సాంప్రధాయం ప్రకారం అతనికి నాలుగు దిక్కుల దిష్టి తీసిన నాయనమ్మ నువ్వు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. రచిన్ రవీంద్రకు అతని నాయనమ్మ నరదిష్టి తీస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు ఇష్టమైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని పలు ఇంటర్వూలలో చెప్పిన రచిన్ రవీంద్ర ఇప్పుడు అదే సచిన్ వరల్డ్ కప్ రికార్డులు బద్దలు కొట్టి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. సచిన్ దగ్గర శిష్యరికం చెయ్యకపోయినా సచిన్ కు రచిన్ రవీంద్ర ఏకలవ్య శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడని తెలిసింది.



Click it and Unblock the Notifications
