ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు!

Posted By:

ఉదయం పూట రోజూ అవే ఇడ్లీలు, దోసెలు, ఉప్మాలు తిని తిని మీకు బాగా విసుగొచ్చిందా? అయితే ఈ సారి కాస్త కొత్తగా, అదే సమయంలో ఆరోగ్యానికి మేలు చేసే అత్యంత పోషకభరితమైన బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి. మన ఇళ్లలో పాతకాలం నాటి చిరుధాన్యాలకు ఇప్పుడు మళ్లీ మంచి డిమాండ్ వస్తోంది. అలాంటి అద్భుతమైన చిరుధాన్యాల్లో సజ్జలు ఒకటి.

సజ్జలతో చేసే కిచిడీ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సంపూర్ణ పోషకాలను అందించే పవర్ ‌హౌస్. ‌ డైటింగ్ చేసే వారికి, మధుమేహం ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Powerhouse of Nutrition How to Make Delicious Healthy Pearl Millet Khichdi Recipe in Telugu

సజ్జ కిచిడీ తయారీకి కావలసిన పదార్థాలు

సజ్జలు- పావు కప్పు
పెసరపప్పు - పావు కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 3
అల్లం - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 1
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 1 రెమ్మ
టమాటో - 1
పసుపు - పావు టీస్పూన్
కారం - 3/4 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - ఒక చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
క్యారెట్ - 1
బీన్స్ - 5
పచ్చి బఠానీలు - గుప్పెడు
నీళ్లు - రెండున్నర కప్పులు
సన్నగా తరిగిన కొత్తిమీర - కొద్దిగా
నెయ్యి - 1 టేబుల్ స్పూన్

పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

సజ్జ కిచిడి తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు దోరగా, పారదర్శకంగా మారే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన టమాటో ముక్కలు వేసి, అవి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి మసాలాల పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు మీడియం మంటపై ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు వేసి మసాలాలతో కలిసేలా మరో 2 నిమిషాల పాటు వేయించాలి.

-ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సజ్జలు, పెసరపప్పును నీళ్లు వంపేసి కుక్కర్‌ లో వేసి కూరగాయల మిశ్రమంతో బాగా కలపాలి. చివరగా రెండున్నర కప్పుల నీళ్లు పోసి అన్నీ సరిగ్గా కలిసేలా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంట మీద 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

-కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తెరిచి పైన గుమగుమలాడే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి వేడివేడిగా కలుపుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, కమ్మటి వాసన వచ్చే పోషకాల సజ్జల కిచిడీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, August 14, 2026, 11:28 [IST]
Desktop Bottom Promotion