Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.!
శ్రావణ మాసంలో వచ్చే తొలి శుద్ధ పంచమిని నాగుల పంచమిగా హిందూ సంప్రదాయంలో ఆచరిస్తారు. ఆ రోజు మహిళలు ఉపవాసం ఉండి ఆలయాల్లో నాగ ప్రతిష్టలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంతానాభివృద్ధి కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ పుట్టలో పాలు పోయడం సంప్రదాయంగా వస్తోంది. అంతేకాకుండా ఈ రోజు శివుడిని సైతం ఆరాధిస్తారు. ఈ రోజు నాగుల పంచమి ఆగష్టు 17న సోమవారం రావడం విశేషం. ఈ సందర్భంగా కాల సర్ప దోషం ఉన్నవారు.. తమ జాతకం ప్రకారం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా దోష ప్రభావాలను తగ్గించుకోవాచ్చు.

కొందరికి తమ జీవితంలో కొన్ని కారణాల వల్ల కాల సర్ప దోషం ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా నాగదేవతను ఆరాధించడంతో పాటు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా దోషం తొలగిపోతుందని పండితులు సూచిస్తారు. ఈ క్రమంలో కాల సర్ప దోష ప్రభావాలను తగ్గించుకోవడం కోసం తమ జాతకం ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తే శివుని ఆశీస్సులు పొందడంతో దోష ప్రభావం తగ్గిపోతుందని పండితులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..
పాలతో శివలింగానికి అభిషేకం
నాగుల పంచమి నాడు శివునికి, నాగదేవతని పూజించడం శుభప్రదంగా పండితులు సూచిస్తారు. ఈ రోజున మొదటగా శివుడిని పూజించి, తర్వాత శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. తర్వాత మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అనంతరం పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించి నాగదేవతను పూజించాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
రావిచెట్టుకి పూజలు
నాగుల పంచమి నాడు రావి చెట్టును పూజించడం అత్యంత శుభప్రదం. ఆ రోజు రావి చెట్టు కింద శుభ్రమైన ప్రదేశంలో పచ్చి పాలను సమర్పించాలి. తర్వాత నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. పిండి, నెయ్యి, బెల్లంతో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించి పూజించడం ద్వారా కాల సర్ప దోష సంబంధిత సమస్యలు తగ్గిపోతాయని పండితులు సూచిస్తున్నారు.

చందన తిలకం..
కాల సర్ప దోషం ఉన్నవారు నాగుల పంచమి రోజు నుదుటిపై చందన తిలకం పెట్టుకోవడం శుభప్రదం. ఆ రోజు నుంచి వరుసగా 41 రోజుల పాటు చందన తిలకం పెట్టుకోవడం ద్వారా మీ శరీరంలో, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఈ ఆచారాన్ని పాటించడం చాలా సులభం..
నల్ల నువ్వులు..
ఒక శుభ్రమైన గిన్నెలో నల్ల నువ్వులు కలిపిన నీటితో నాగ పంచమి రోజున శివిలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం ద్వారా ప్రతికూల గ్రహ ప్రభావాలు తగ్గిపోతాయి. ఫలితంగా కాలసర్ప దోష సంబంధిత సమస్యలు తగ్గిపోవడానికి దోహదపడుతుందని పండితుల సలహా..
వెండి విగ్రహాలు
కాల సర్ప దోషం నుంచి ఉపశమనం పొందేందుకు నాగుల పంచమి రోజు ఒక జత వెండి పాములను పూజిస్తే ప్రయోజనం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. ఆ రోజు జత వెండి పాములను శివాలయానికి తీసుకెళ్లి శివునికి సమర్పించాలి. లేదా ఒక జతను శివునికి సమర్పించి మరొక జతను పవిత్ర నదిలో నిమజ్జనం చేయడం ద్వారా పరిహారం పొందవచ్చు. లేదా పర్యావరణానికి అనుకూలంగా నిమజ్జనం చేయకుండా పండితుల సలహాను పాటించవచ్చు.



Click it and Unblock the Notifications
