Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Sardar Vallabhbhai Patel: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆసక్తికర విషయాలు
సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి చాలా కొంతమందికి మాత్రమే తెలిసిన వాస్తవాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Sardar Vallabhbhai Patel: సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయనది కీలక పాత్ర. గుజరాత్ లోని నడియాడ్ నగరంలో 1875లో జన్మించిన పటేల్.. బారిష్టర్‌గా వృత్తి ప్రారంభించారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన పటేల్(Sardar Vallabhbhai Patel).. స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు.

స్వతంత్ర భారత్‌లో రాజ్యాల విలీనంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. అలా ఆయనకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా(Iron Man Of India)గా పేరు వచ్చింది.
తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఉక్కు మనిషి పటేల్.. 1950 లో డిసెంబర్ 15న బొంబాయిలో గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. ఈరోజు ఆయన 72వ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి చాలా కొంతమందికి మాత్రమే తెలిసిన వాస్తవాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజును అక్టోబర్ 31న జరుపుకుంటున్నాం. కానీ, ఆయన అసలు పుట్టిన తేదీ అది కాదు. మెట్రిక్యులేషన్ పరీక్షకు హాజరవుతున్నప్పుడు యాదృచ్ఛికంగా అక్టోబర్ 31, 1875 అనే తేదీ వేశారు.
అక్టోబర్ 31ని భారత ప్రభుత్వం రాష్ట్రీయ ఏక్తా దివాస్‌గా ప్రకటించింది.
* పటేల్ 16 ఏళ్ల వయస్సులో ఝవెర్బా పటేల్‌ను వివాహం చేసుకున్నారు.
* పటేల్ తన 22వ ఏట మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణులయ్యారు.

* గుజరాత్ మహమ్మారి బారిన పడినప్పుడు పటేల్‌కు బుబోనిక్ ప్లేగు సోకింది.
* కుటుంబానికి దూరంగా ఉంటూ స్నేహితుల నుండి పుస్తకాలు అరువు తెచ్చుకుంటూ విద్యాభ్యాసం పూర్తి చేశారు.
* పటేల్ ఇంగ్లండ్ వెళ్లే ముందు గోద్రా, బోర్సాద్, ఆనంద్‌లలో న్యాయశాస్త్రం అభ్యసించారు.
* సర్దార్ పటేల్ 36 ఏళ్ల వయస్సులో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు ఇంగ్లండ్ వెళ్లారు. ఆయన లండన్ ఇన్స్ ఆఫ్ కోర్టులోన మిడిల్ టెంపుల్‌లో చేరారు. ఆయన తన 36 నెలల కోర్సును 30 నెలల్లోనే పూర్తి చేశారు.

* పటేల్ తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధత చూపేవారు. 1909లో ఆయన భార్య ఝవెర్బా 1909లో క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు ఆయనకు సమాచారం అందింది. ఆ సమయంలో ఆయన ఓ కేసు విషయంలో సాక్షిని క్రాస్ ఎగ్జామినేట్ చేస్తున్నారు. భార్య చనిపోయినట్లు నోట్ అందగా.. దానిని ఆయన జేబులో పెట్టుకుని తన పనిని కొనసాగించారు.
* ఇంగ్లండ్ నుండి తిరిగి స్వస్థలానికి వచ్చే సమయానికి పటేల్ వేషాభాష పూర్తిగా మారిపోయింది. చేతిలో ఎప్పుడూ సిగార్ ఉండేది. కానీ మహాత్మ గాంధీతో స్వతంత్ర పోరాటంలోకి దిగిన తర్వాత అన్నింటినీ మానుకున్నారు.
* ఒకసారి మహాత్మా గాంధీ క్లబ్‌కు ప్రసగించడానికి వచ్చారు. ఆసమయంలో క్లబ్‌లో బ్రిడ్జి ఆడుతున్నందున పటేల్.. గాంధీ ప్రసంగానికి హాజరు కాలేదు. ఆ సమయంలో గాంధీ సిద్ధాంతాలను సమర్థించేవారు కాదు పటేల్.

* రైతులకు మద్దతుగా గాంధీజీ ఇండిగో తిరుగుబాటు ద్వారా పటేల్ ఎంతో స్ఫూర్తి పొందారు. 1917లో గాంధీజీని కలిసిన తర్వాత పటేల్ మనసు మార్చుకుని భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు.
* రాజకీయ నాయకుడిగా మారాలనే ఆసక్తి పటేల్‌కు లేదు. స్నేహితుల ఒత్తిడితో 1917లో అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
* జలియన్‌వాలాబాగ్ ఊచకోత తర్వాత గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. పటేల్ ఆయనకు హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చారు. పటేల్ అహ్మదాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో భోగి మంటలు వేశారు. ఆయన తన ఆంగ్ల దుస్తులను, ఆస్తులను తగులబెట్టారు. ఖాదీని స్వీకరించారు.

* 15 ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీలలో 12 మంది కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 1946 ఎన్నికల్లో పటేల్‌ను విజేతగా సిఫార్సు చేశారు. మహాత్మా గాంధీ మద్దతు ఉన్నప్పటికీ ఒక్క కమిటీ కూడా జవహర్‌లాల్ నెహ్రూ పేరును ముందుకు తీసుకురాలేదు. తర్వాత నెహ్రూకు మార్గం కల్పించడానికి పటేల్ రాజీనామా చేశారు.
* పటేల్‌ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక పితామహుడిగా పిలుస్తారు.



Click it and Unblock the Notifications











