Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
ప్రతి మగాడు తప్పక చూడాల్సిన వీడియో..నెలసరి నొప్పి పురుషులకి రుచి చూపించారుగా
పీరియడ్స్ లేదా నెలసరి ఈ పేరు వినడానికి కొంతమంది చాలా ఇబ్బంది పడతారు. నలుగురిలో దీని గురించి మాట్లాడాలంటే ఒకప్పుడు చాలా ఇబ్బందికరంగా భావించేవాళ్లు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. సాధారణంగా పీరియడ్స్ అనే పేరు వినబడగానే చాలామంది మహిళల కళ్ల ముందు నరకం కదలాడుతుంది. ప్రతి నెలా వచ్చే ఆ మూడు రోజులు శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనను అనుభవిస్తారు. కానీ,చాలా మంది పురుషులకు ఇది ఓ సాధారణ విషయంగానే కనిపిస్తుంది. అదో పెద్ద నొప్పా అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. ఆ నొప్పి తీవ్రతను వారికి ఎలా అర్థమయ్యేలా చెప్పడం? ఈ ప్రశ్నకు సమాధానంగా సోషల్ మీడియాలో ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
కొందరు యువకులను కుర్చీలో కూర్చోబెట్టి, వారికి కృత్రిమంగా నెలసరి నొప్పిని అనుభవించేలా చేశారు. మహిళలు అనుభవించే భరించలేని ఆ బాధను వారికి కొన్ని క్షణాల పాటు రుచి చూపించారు. నొప్పి మొదలైన కొద్దిసేపటికే ఆ యువకుల ముఖాల్లో రంగులు మారిపోయాయి. కొందరు గట్టిగా కేకలు పెట్టగా, మరికొందరు అమ్మో ఇది ప్రసవ వేదనలా ఉంది అని విలవిల్లాడారు. ఒకరైతే తన తల్లిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోగా, ఇంకొకరు ప్రతి నెలా మహిళలు ఈ నరకాన్ని ఎలా భరిస్తారు అని ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశ్యం ఇదే
పురుషుల్లో నెలసరి నొప్పి పట్ల అవగాహన కల్పించడం. స్త్రీలు పడే బాధను వారికి అర్థమయ్యేలా చేసి, వారిలో సానుభూతిని, సున్నితత్వాన్ని పెంచడమే లక్ష్యం. దీనివల్ల ఇళ్లలో, కార్యాలయాల్లో, చివరికి పాఠశాలల్లో కూడా స్త్రీలకు మరింత సహాయకరమైన, సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.
ఎప్పుడు ఇది జరిగింది
కప్ ఆఫ్ లైఫ్ అనే సంస్థ ఈ ప్రయోగాన్ని కొచ్చిలోని ఓ మాల్ లో 2022లో నిర్వహించింది. ఋతు ఆరోగ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ఎర్నాకుళం ఎంపీ హైబీ జార్జ్ ఈడెన్(Hibi George Eden) చేతుల మీదుగా ఇది ప్రారంభించబడింది.
డాక్టర్ చెబుతుందిదే
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా ఇటీవల ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. పీరియడ్ పెయిన్ ని చాలామంది తేలికగా తీసుకుంటారు, కానీ దాని తీవ్రత ఒక తేలికపాటి గుండెపోటుతో సమానం అని డాక్టర్ మనన్ వోరా తెలిపారు. ఆ నొప్పితోనే మహిళలు ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి, ఆ సమయంలో మహిళలను మరింత జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని.. వారికి విశ్రాంతినిచ్చి, పనుల్లో సహాయం చేస్తూ, మానసికంగా అండగా నిలవడం ఎంతో ముఖ్యమన్నారు. చిన్నపాటి ప్రేమ, కాస్తంత సహాయం... ఆ నరకయాతన నుండి వారికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయని తెలిపారు.



Click it and Unblock the Notifications
