Latest Updates
-
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు!
అన్నం లేకుండా వారం రోజులు అయినా బతుకుతారేమో కానీ ఈ రోజుల్లో ఫోన్ లేకుండా క్షణం ఉండలేనోళ్లు చాలామందే ఉన్నారు. ఉదయం కళ్లు తెరిచిన దగ్గర నుంచి నైట్ నిద్ర వచ్చేదాకా క్షణం తీరిక లేకుండా ఫోన్ స్క్రీన్ ను చూస్తూ గడిపేవాళ్ల సంఖ్య పెరగిపోతుంది. అయితే ఎక్కువ సేపు ఫోన్ చూడటం మంచి కాదు అని ఎవరైనా చెబితే నీ పని నువ్వు చుసుకో అంటున్నారు నేటి తరం యువతీ యువకులు. అయితే తాజాగా ఫోన్ ఎక్కువగా వాడొద్దని తన కూతురుకి చెప్పిన తండ్రి ఆమె ఆగ్రహానికి గురై ప్రాణాల కోల్పోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోని కోసాడ్ ఏరియాలో కాజోల్ అనే 22 ఏళ్ల యువతి తన కుటుంబంతో నివిసిస్తోంది. అయితే కాజోల్ విపరీతంగా ఫోన్ వాడుతుండేది. గేమ్స్, సోషల్ మీడియా అంటూ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతుండేది. కూతురు బిహేవియర్ చూసిన తండ్రి రమేష్ చౌహాన్(55) ఫోన్ ఎక్కువగా వాడకు అని చాలా సార్లు చెప్పి చూశాడు. అయినా కాజల్ తండ్రి మాటలను లెక్కచేయలేదు.

ఈ క్రమంలో గత ఆదివారం రమేష్ చౌహాన్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంటి పనుల్లో కూడా వేలు పెట్టట్లేదు, ఎప్పుడు చూసిన ఆ ఫోన్ నే పట్టుకుని తిరుగుతుంది అని భార్య మంజు చెప్పడంతో రమేష్ చౌహాన్ తన కూతురు దగ్గరకు వెళ్లి.. ఎప్పుడూ ఫోన్ లో ఏం చేస్తావు, వెళ్లి ఇంటి పనుల్లో అమ్మకు సాయం చెయ్యి, నీ చదువు మీద ఫోకస్ పెట్టు అని గట్టిగా చెప్పాడు. అయితే కాజోలో తండ్రి మాటలను లెక్కచేయలేదు. దీంతో వెంటనే అతను కూతురు చేతుల్లోని ఫోన్ లాక్కని నేలకేసి పగులకొట్టాడు.
తండ్రి ఫోన్ పగలకొట్టడంతో కాజోల్ లో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే కుక్కర్ పైన ఉండే మూతను తీసుకుని తండ్రిని బాదిపడేసింది. తర్వాత కత్తితో తండ్రిని కడుపుతో పొడిచేసింది. అరుపులు వినిపించడంతో మంజు కిచెన్ లోకి వచ్చి చూడగా తలలో నుంచి కడుపులో నుంచి రక్తం కారుతూ నేలపై పడి ఉన్న భర్తను చూసి షాక్ అయ్యింది.
వెంటనే రమేష్ చౌహాన్ ని దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా..అక్కడ డాక్టర్లు ఆయన చనిపోయినట్లు కన్ఫర్మ్ చేశాడు. దీంతో కన్న కూతురు మీదనే తల్లి మంజు కంప్లెయింట్ చేయగా పోలీసులు కేసు నమోదుచేసి ఆదివారం రాత్రి కాజోల్ ని అరెస్ట్ చేశారు. అయితే చనిపోయిన రమేష్ చౌహాన్ కాజల్ కి కన్న తండ్రి కాదని..కాజల్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా,ఆమె తల్లి రమేష్ చౌహాన్ ని పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.



Click it and Unblock the Notifications
