Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
New Year 2025: మందుబాబులకు గుడ్ న్యూస్..ఎంత అయినా తాగొచ్చు..! అప్పటివరకు ఎలాంటి పరిమితులు లేవు
న్యూ ఇయర్ వచ్చిందంటే.. డిసెంబర్ 31st రోజు రచ్చ రచ్చ చేయాల్సిందే. మందు చిందుతో పాత సంవత్సరాన్ని వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఆరోజు భారీ ఎత్తున మద్యం అమ్మకాలు, భారీ ఎత్తున మాంసాహారం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మందుబాబులకు ఈ వార్త కచ్చితంగా సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వార్త ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
న్యూ ఇయర్ రోజు..
సాధారణంగా దేశ వ్యాప్తంగా డిసెంబర్ 31st పార్టీలు ఘనంగా నిర్వహిస్తుంటారు. బార్లు, వైన్స్, పబ్‌లన్నీ కిక్కిరిసిపోతాయి. ఆరోజు భారీగా మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోజు ప్రత్యేకంగా ఈవెంట్లు, పార్టీలు నిర్వహిస్తుంటారు కూడా. ఎక్కడ చూసినా మనకు మద్యం ఏరులై పారులవుతుంటుంది. కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతం తెలిపేందుకు చాలా మంది ఉత్సాహంగా ఉన్న వేళ తెలంగాణ ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది.

మందు బాబులకు గుడ్ న్యూస్
డిసెంబర్ 31st ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు తెలంగాణ ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి 12 గంటల వరకు వైన్స్ తెరుచుకోవచ్చని తెలిపింది. అలాగే బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు అర్థరాత్రి 1 గంటలకు వరకు తెరుచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ 31వ తేదీన ఎవరైతే పార్టీలు చేసుకోవాలనుకుంటున్నారో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి వరకు వేడుకలను నిర్వహించుకోవచ్చని చెబుతున్నారు. ఈ వార్తపై బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా రోజులతో పోలిస్తే ఆరోజే గల్లా పెట్టెలే లక్ష్మీదేవి వచ్చి చేరే ఛాన్సుంటుంది.
ఈ పనులు చేస్తే జైలుకే..
డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి వరకు వైన్స్, బార్లు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ కొన్ని షరతులను విధించింది. ఈ నేపథ్యంలో వైన్స్, బార్లలో డ్రగ్స్ వినియోగాన్ని నిషేధించింది. అలాగే ఈవెంట్లు, పార్టీలలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. GHMC అధికారులు తమ తమ పరిధిలోని పార్టీలు, ఈవెంట్లపై నిఘా ఉంచాలని, డ్రగ్స్ వినియోగం ఉన్నట్లు తేలితే కచ్చితంగా కఠిన శిక్షలు విధించాలని తెలిపింది. ప్రభుత్వ ఈ నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం లభించనుంది.



Click it and Unblock the Notifications