Latest Updates
-
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
శాంతిని పంచిన క్రీస్తును ఎందుకు సిలువ వేయాల్సి వచ్చింది?
డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు..చలిగాలులతో పాటు క్రిస్మస్ పండుగ సందడి కూడా ప్రపంచవ్యాప్తంగా మొదలవుతుంది. వీధులన్నీ నక్షత్రాల వెలుగులతో మెరిసిపోతుంటే, చర్చిలలో క్రీస్తు గీతాలు మార్మోగుతుంటాయి. ఈ పండుగ కేవలం వేడుక మాత్రమే కాదు, దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక చారిత్రక ఘట్టానికి గుర్తు. అదే యేసు క్రీస్తు జననం, క్రైస్తవ మత ఆవిర్భావం.
అసలు క్రిస్మస్ ఎలా మొదలైంది? శాంతిని బోధించిన యేసుక్రీస్తును ఎందుకు సిలువ వేయాల్సి వచ్చింది అనే ముఖ్య విషయాలను ఇక్కడ చూడండి.

యూదు మతం, యేసు ప్రస్థానం
చరిత్రకారుల ప్రకారం యేసు యూదు కుటుంబంలోనే జన్మించారు. పుట్టుకతోనే ఆయన దైవిక లక్షణాలు కలిగిన వ్యక్తిగా భావించబడ్డారు. ఆ కాలంలో యూదు మత ఆచారాలు చాలా కఠినంగా ఉండేవి. యేసు ప్రారంభంలో యూదు సిద్ధాంతాలను గౌరవించినప్పటికీ రానురాను ఆ మతంలో పేరుకుపోయిన వివక్ష, మూఢనమ్మకాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు.
క్రీస్తుశకం 30-33 ప్రాంతంలో జెరూసలేం కేంద్రంగా ఆయన బోధనలు ప్రజలను ఆకర్షించాయి. పేదలు, అణగారిన వర్గాల పట్ల చూపిస్తున్న వివక్షను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది యూదు మత పెద్దలకు మింగుడు పడలేదు.
తిరుగుబాటు
యేసు జీవితంలో కీలక మలుపు జెరూసలేం ఆలయంలో జరిగింది. పవిత్రమైన దేవుని ఆలయాన్ని వ్యాపారులు, పశువుల కాపరులు తమ అడ్డాగా మార్చుకోవడం చూసి యేసు ఆగ్రహించారు. నా తండ్రి ఇంటిని వ్యాపార కేంద్రంగా మారుస్తారా? అంటూ వారిని ఎదిరించారు. ఈ చర్యతో ఆయన ప్రజలలో కొందరి మద్దతు పొందగా, యూదు మత పెద్దలు మాత్రం ఆయనను తమ అధికారానికి ముప్పుగా భావించారు.
కుట్ర
యేసుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక 21 మందితో కూడిన యూదు మత పెద్దల కౌన్సిల్ ఆయనపై కుట్ర పన్నింది. ఆయనను మతద్రోహిగా, దైవదూషణ చేస్తున్న వ్యక్తిగా చిత్రీకరించి మరణశిక్ష విధించాలని నిర్ణయించారు. అయితే ఆ సమయంలో అధికారం రోమన్ చక్రవర్తుల చేతిలో ఉండేది.
దీంతో యేసును.. రోమన్ రాజు హెరోడ్ అంతిపా, గవర్నర్ పిలాతు ముందు హాజరుపరిచారు. నువ్వు యూదుల రాజువా? అని పిలాతు ప్రశ్నించినప్పుడు.. నేను సత్యానికి సాక్షిగా ఉన్న నాయకుడిని అని యేసు బదులిచ్చారు. పిలాతు విచారణలో యేసు ఏ తప్పూ చేయలేదని భావించినా, బయట గుమిగూడిన యూదుల మూక ఆయనను శిలువ వేయాల్సిందేనని పట్టుబట్టింది. మత పెద్దల ఒత్తిడికి తలొగ్గిన పిలాతు చివరకు శిక్షను ఖరారు చేశారు.

శిలువ, అనంతర పరిణామాలు
ప్రజల డిమాండ్ మేరకు యేసును, ఆయన సహచరులను దారుణంగా శిలువ వేసి చంపారు. అయితే యేసు మరణం ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త శకానికి ఆరంభం. ఆయన మరణం తర్వాత ఆయన శిష్యులు ఆ బోధనలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. యేసును అన్యాయంగా చంపారన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
కాలక్రమేణా రోమన్లు కూడా యూదులకు వ్యతిరేకంగా మారారు. యూదు మతం నుండి విడివడి క్రీస్తు బోధనల ఆధారంగా క్రైస్తవ మతం ఒక ప్రత్యేక శక్తిగా అవతరించింది. యేసు మరణానికి కారణమైన జెరూసలేం నేటికీ ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాలకు కేంద్ర బిందువుగా
యేసు జీవితం, మరణం, పునరుత్థానం అనేవి కేవలం మతపరమైన అంశాలే కాదు మానవ చరిత్రను మలుపు తిప్పిన సంఘటనలు. అందుకే ప్రతి ఏటా క్రిస్మస్ రూపంలో ఆ జ్ఞాపకాలను ప్రపంచం స్మరించుకుంటుంది.



Click it and Unblock the Notifications