Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అసలెలా ఉండాలి, ఎలా ఉంటే వాటిని ఆచరించగలం
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. పాటించే విధంగా ఉండాలి. ఎక్కువ కష్టం, శ్రమతో కూడుకున్న తీర్మానాలను ఎక్కువ రోజులు పాటించలేము. అసలు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాటిని పాటించగలమో ఇప్పుడు తెల
న్యూ ఇయర్ అనగానే రిజల్యూషన్స్ అంటూ మొదలుపెడతారు చాలా మంది. నీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి అంటూ ప్రశ్నలు సంధిస్తుంటారు. ఈ రిజల్యూషన్స్ కచ్చితంగా పాటిస్తే జీవితంలో మంచి మార్పు రావడం మాత్రం ఖాయం. కానీ రిజల్యూషన్స్ ముచ్చట కొన్ని రోజుల వరకే ఉంటుంది. తర్వాత వాటిని పాటించలేక వదిలేస్తుంటారు.

జిమ్‌కు వెళ్లడం, సాయంత్రం వాకింగ్ లేదా జాగింగ్, ఏదైనా కోర్సు నేర్చుకోవడం, మందు తాగకపోవడం ఇలాంటివి ఎన్నో రిజల్యూషన్స్ ఉంటాయి. అయితే వాటిని కొన్ని రోజులు బాగానే పాటిస్తారు. తర్వాత పాటించలేక వదిలేస్తుంటారు చాలా మంది.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. పాటించే విధంగా ఉండాలి. ఎక్కువ కష్టం, శ్రమతో కూడుకున్న తీర్మానాలను ఎక్కువ రోజులు పాటించలేము. అసలు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాటిని పాటించగలమో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వాస్తవానికి దగ్గరగా ఉండే గోల్స్ తీసుకోవాలి
సరైన లక్ష్యం తీసుకోకపోతే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా కష్టపడితే చేయవచ్చు అనే గోల్స్‌ను మాత్రమే తీసుకోవాలి. ఇప్పటివరకు ఎప్పుడూ వ్యాయామం చేయని వారు 3, 4 నెలల్లోనే ఫిట్‌గా మారాలనుకోవడం సాధ్యం కాదు. మీరు రోజూ మందు తాగేవారైతే ఉన్నపలంగా మందు మానేయడం సాధ్యం కాదు. కొన్ని రోజుల పాటు చేయవచ్చు కానీ ఎక్కువ రోజులు దానిని కొనసాగించలేరు. మందు మానేయడం మీ లక్ష్యం అయితే హాఫ్ నుండి క్వార్టర్, క్వార్టర్ నుండి 90ఎంఎల్, తర్వాత ఒక పెగ్, రెండు మూడు రోజులకు ఒక పెగ్, వారానికి ఒకసారి, తర్వాత పండగల వేళ మాత్రమే ఇలా చేస్తూ పోతే మంచి ఫలితం కనిపిస్తుంది.

2. చిన్న లక్ష్యాలు ఉండాలి
చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. వాటిని అందుకోవడం కొద్దిగా సులభంగా ఉంటుంది. ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ పోతే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం చేయగలం అనే నమ్మకం వస్తుంది. ఆ లక్ష్యాలను చేరుకున్నప్పుడు వచ్చే ఆనందం మరింత ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

3. ప్రణాళిక ముఖ్యం
న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకున్నారు సరే.. మరి దానిని సాధించడానికి ఏమేం చేయాలని ప్లాన్ వేసుకున్నారా లేదా. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి సరైన ప్రణాళిక చాలా అవసరం. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే చాలా లక్ష్యాలను చేరుకోవచ్చు.

4. ఏం చేస్తున్నారో ఎప్పుడూ రివ్యూ చేసుకోవాలి
లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దాని కోసం కష్టపడుతున్నారు అనుకుందాం. ఇలా కష్టపడుతున్నప్పుడు ఇదంతా అవసరమా అని ఒక దశలో అనిపిస్తుంది. హ్యాపీగా ఉండటం మనకు కావాల్సింది, ఇది లేకపోయినా ఉంటాం కదా.. అనే ఆలోచనలు వస్తాయి. వాటిని రాకుండా ఆపలేం. లక్ష్య సాధనలో ఎంత దూరం వెళ్లాం, ఎలా వెళ్తున్నాం అని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి. అది మీలో మోటివేషన్ కల్పిస్తుంది.

5. మీ రిజల్యూషన్ గురించి అందరికీ చెప్పడం
న్యూ రిజల్యూషన్స్ అందరికీ చెప్పాలి. కనీసం ఫ్రెండ్స్‌తో అయినా షేర్ చేసుకోవాలి. లక్ష్యాలను చేరుకోవడం వాళ్లు హెల్ప్ చేయవచ్చు. లేదా ప్రోత్సహించవచ్చు. ఫ్రెండ్స్ అయితే పరువు తీస్తారన్న భయంతో అయినా మీరు కష్టపడి లక్ష్యం కోసం పని చేయవచ్చు.

6. మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోండి
ఫిట్‌నెస్ మీ గోల్ అయితే రోజూ కష్టపడి పని చేస్తున్నప్పుడు మీకు మీరు ప్రశంసాపూర్వకంగా గిఫ్ట్ ఇచ్చుకోండి. అంటే కొత్త షూలు, మంచి జిమ్ వేర్ లాంటివి బహుమతిగా ఇచ్చుకోండి.



Click it and Unblock the Notifications
