ఇలాంటి బాస్‌ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్‌ప్రైజ్‌.!

ఒక ఆఫీసులో యజమాని, ఉద్యోగులంటే వారి బంధం విధి నిర్వహణ వరకే ఉంటుందా అంటే కాదు.. కంపెనీ లాభాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఉద్యోగులు మేమున్నామనే ధైర్యం ఇవ్వాలి. అందుకు ప్రతిఫలంగా ఎంప్లాయిస్‌కి నెల జీతం ఇస్తే సరిపోతుందా.. లేదు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వారికి మరింత సంతోషం ఇచ్చేలా సర్‌ప్రైజ్‌లు ఉండాలి. అలాంటి సర్‌ప్రైజ్‌లు ఇచ్చేటప్పుడు ఏమాత్రం పక్షపాతం ఉండకూడదు. లేదంటే ఆఫీసు రాజకీయాలు మొదలవడం పక్కా. మొత్తంగా ఉద్యోగులు, యజమాని మధ్య బంధం అంటే ఎలా ఉండాలో ఈ వీడియో చూసి నేర్చుకోవాల్సిందే. ఇంతకీ ఏం జరిగింది.. ఎక్కడ జరిగిందంటే..

Uae world star man power ceo surprise to employees with iphones and chocolates

యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌(యుఏఈ)కి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగుల కోసం ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో లైక్‌ల పంట పండిస్తోంది. ఇది ప్రతి ఆఫీసులో బోనస్‌లో భాగం కావచ్చు అనుకోవచ్చు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సినిమా ట్విస్టులను తలపించే ఉన్న ఈ కొద్దిపాటి సెకన్ల సర్‌ప్రైజ్‌ వీడియోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యూఏఈకి చెందిన మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ 'వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్' ఫౌండర్‌ నిషాద్ హుస్సేన్, ఆ కంపెనీ ఎండీ, ఆయన భార్య హసీనా నిషాద్ ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్‌ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్‌ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!

వీడియోలోని సమాచారం ప్రకారం.. కంపెనీ సీఈఓ ఒక టేబుల్‌పై గిఫ్ట్‌ బాక్సులు ఉంచారు. తమకు నచ్చిన బాక్సును ఎంచుకోవాలని ఉద్యోగులకు సూచించారు. బాస్‌ సూచన మేరకు ఒక్కో ఉద్యోగి వరుసగా నిలబడి ర్యాండమ్‌గా బాక్సును ఎంచుకుని ఓపెన్‌ చేశారు. ఈ క్రమంలో మొదటగా సెలెక్ట్‌ చేసుకున్న ఉద్యోగి బాక్స్‌ ఓపెన్‌ చేయగానే అందులో ఐఫోన్‌ కనిపించింది. దీంతో ఎగిరి గంతేయడం ఉద్యోగి వంతైంది. ఐఫోన్‌ చూడటంతో ఎనలేని ఉత్సాహంతో రెండో ఉద్యోగి కూడా బాక్స్‌ సెలెక్ట్‌ చేసుకుని ఓపెన్‌ చేయగానే అందులో చాక్లెట్‌ కనిపించింది. దీంతో ఒక్కసారిగా నిరాశకు గురైన ఉద్యోగి.. ఆ నిరుత్సాహం బయటకు కనిపించకుండా మ్యానేజ్‌ చేశాడు.

ఈ క్రమంలో మిగతా ఉద్యోగులు ఇదేం ట్విస్ట్‌ రా బాబు అనుకుంటూ ఓ వైపు భయం, మరోవైపు ఎగ్జైట్‌మెంట్‌తో బాక్సులు తీసుకుని ఓపెన్‌ చేశారు. వారిలో కొందరికి ఐఫోన్లు రాగా, మరికొందరికి చాక్లెట్లు వచ్చాయి. ఐఫోన్‌ వచ్చిన ఎంప్లాయిస్‌ సంతోషంలో మునిగి తేలగా.. మిగతా ఉద్యోగులు తమ అదృష్టం ఇంతేనేమోనని సరిపెట్టుకున్నారు.

ఇక్కడే అసలు ట్విస్ట్‌

ఐఫోన్‌, చాక్లెట్స్‌ తీసుకున్న ఉద్యోగులు అక్కడే నిలబడి ఉండగా.. అప్పుడే వెనుక నుంచి వచ్చిన సీఈఓ భార్య కొన్ని గిఫ్ట్‌ బ్యాగులను తీసుకువచ్చారు. వాటిని చాక్లెట్స్‌ వచ్చిన ఉద్యోగులకు ఇచ్చారు. దీంతో ఈ సడెన్‌ ట్విస్ట్‌ ఊహించని ఉద్యోగులు సర్‌ప్రైజ్‌ అయి సంతోషంగా బాక్సులు తీసుకువచ్చారు. వాటిలో ఐఫోన్లు ఉండటంతో వారి సంతోషానికి అవధులు లేవు. ఈ మొత్తం సంఘటన వీడియో తీయడంతో ఒక షార్ట్‌ ఫిలిం చూసిన అనుభూతితో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్‌ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్‌ వైరల్‌.! ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్‌ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్‌ వైరల్‌.!

సర్‌ప్రైజ్‌ గిఫ్టుల అనంతరం ఉద్యోగులకు ప్రత్యేక సందేశాన్ని అందించారు హసీనా నిషాద్‌. నిజమైన సక్సెస్‌ అంటే వ్యాపారాన్ని డెవలప్‌ చేయడం మాత్రమే కాదని.. ఉద్యోగుల కృషి, పాజిటివ్‌ థింకింగ్‌, టీమ్‌ బిల్డింగ్‌ ఎంతో అవసరమని సూచించారు. కంపెనీ పురోగతిలో ప్రతి ఉద్యోగం ప్రయత్నం, ఆలోచన, సహకారం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. టీమ్‌ సపోర్ట్‌ చాలా ముఖ్యమని, అప్పుడే కొత్త విషయాలు నేర్చుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటారని హితవు పలికారు. ఉద్యోగులు తమ సామర్థ్యంపై నమ్మకంతో క్లిష్ట పరిస్థితులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు.

Story first published: Saturday, September 26, 2026, 12:37 [IST]
Desktop Bottom Promotion