Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు
కోకిల కిలకిల రావాలు, లేత మామిడి చిగురులు, మల్లెల సుగంధాలు, వేపపూత పరిమళాల మధ్య ప్రకృతి కాంత తనను తాను కొత్తగా ముస్తాబు చేసుకునే అద్భుతమైన సమయం ఉగాది. తెలుగువారికి ఇదే తొలి పండుగ.. సరికొత్త సంవత్సరానికి మధురమైన నాంది.
కాలచక్రంలో పాత జ్ఞాపకాలను వదిలేసి, కొత్త ఆశలకు ఊపిరిపోసే ఈ పర్వదినం రాగానే ప్రతి తెలుగింటిలోనూ ఓ ఆహ్లాదకరమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. 2026వ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది? ఈ నూతన సంవత్సరం పేరు ఏంటీ? ఉగాది రోజు మనం పాటించే ఆచారాలు, సంప్రదాయాలు ఏమిటి? అనే విషయాలను ఇక్కడ చూడండి.

2026లో ఉగాది ఎప్పుడంటే?
భారతీయ కాలమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. 2026వ సంవత్సరంలో ఈ పవిత్రమైన పండుగ మార్చి 19వ తేదీ గురువారం నాడు రాబోతోంది. ఆ రోజు నుంచే తెలుగు వారి నూతన సంవత్సరం అధికారికంగా ప్రారంభమవుతుంది. వసంత రుతువు ఆగమనానికి స్వాగతం పలికే ఈ రోజును మహారాష్ట్రలో గుడి పడ్వా అని, కర్ణాటకలో యుగాది అని వివిధ పేర్లతో సంబురంగా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం పేరు
ఉగాదితో తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఒక్కో సంవత్సరాన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. 2026 ఉగాది నుంచి ప్రారంభమయ్యే నూతన సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. పరాభవ అనే భావనను ఆధ్యాత్మికంగా చూస్తే ఇది మనలోని గర్వం, స్వార్థం, అహంకారం వంటి లక్షణాలను జయించి విజచయం వైపు నడిపించే కాలాన్ని సూచిస్తుంది.
ఉగాది ఆచారాలు - వేడుకలు
పండుగ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని అభ్యంగన స్నానం (తలస్నానం) చేయడం మన పురాతన ఆచారం. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు, బంతి పూలతో కళకళలాడే తోరణాలు కడతారు.
ఇంటి వాకిట్లో పసుపు, కుంకుమ, పూలతో అందమైన రంగుల ముగ్గులు వేస్తారు. కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు ధరించి, గుడికి వెళ్లి దేవుడి ఆశీస్సులు తీసుకుంటారు. బంధుమిత్రులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ.

జీవితానికి ప్రతీక - షడ్రుచుల పచ్చడి
ఉగాది పండుగకు అసలైన అర్థం, పరమార్థం ఉగాది పచ్చడి. ఆరు రుచుల అద్భుత సమ్మేళనంగా తయారు చేసే ఈ పచ్చడి, మానవ జీవితంలో ఎదురయ్యే విభిన్న అనుభవాలకు ప్రతీక.
తీపి (బెల్లం): జీవితంలో వచ్చే సంతోషం.
వగరు (లేత మామిడి): కొత్త సవాళ్లు, ఆశ్చర్యాలు.
చేదు (వేప పూత): జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు.
కారం (మిరియాలు లేదా పచ్చిమిర్చి): కోపం, అసహనం.
ఉప్పు: జీవితంలో ఉత్సాహం.
పులుపు (చింతపండు): నేర్పుగా వ్యవహరించాల్సిన కష్టమైన పరిస్థితులు.
ఈ ఆరు రుచులను సమానంగా ఎలా స్వీకరిస్తామో జీవితంలో వచ్చే కష్టసుఖాలను, గెలుపు ఓటములను కూడా స్థితప్రజ్ఞతతో అంతే సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇక మధ్యాహ్నం భోజనంలో బొబ్బట్లు (భక్ష్యాలు), పులిహోర లాంటి నోరూరించే పిండివంటలు పండుగ రుచిని రెట్టింపు చేస్తాయి.
పంచాంగ శ్రవణం
ఉగాది రోజు సాయంత్రం దేవాలయాల్లో లేదా గ్రామ కూడళ్లలో పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం వినడం అత్యంత ముఖ్యమైన ఘట్టం. కొత్త సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి? వాతావరణం, వర్షపాతం, వ్యవసాయం, రాశుల వారిగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయి? అని తెలుసుకుంటారు. దీని ద్వారా ఆ ఏడాదికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.



Click it and Unblock the Notifications
