Latest Updates
-
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి!
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఎన్ని రోజులు తినాలి? ఈ రహస్యం మీకు తెలుసా?
ఆమని రాకతో ప్రకృతి పచ్చని తివాచీ పరుచుకుంటుంది. మామిడి చిగుర్లు, కోకిలల కుహూ కుహూ రాగాలు, వేప పూత పరిమళాల మధ్య తెలుగువారి లోగిళ్లలో కొత్త సంవత్సరం కోలాహలం మొదలుకానుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఉగాది పండుగతో తెలుగువారి నూతన సంవత్సరం అట్టహాసంగా ఆరంభమవుతుంది. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న (గురువారం నాడు) రేవతి నక్షత్ర ప్రవేశంతో వస్తోంది.
గతించిన కాలం మనకు ఎన్నో అనుభవాలను, పాఠాలను నేర్పింది. కష్టసుఖాలు, ప్రమాదాలు, ప్రమోదాల కలబోతగా గడిచిన విశ్వావసు నామ సంవత్సరానికి ఆత్మీయంగా వీడ్కోలు పలుకుతూ.. కోటి ఆశలతో, నవ్య కాంతులతో శ్రీ పరాభవ నామ సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతున్నాం. రైతన్నలు కొత్తగా సాగు పనులు మొదలుపెట్టే అత్యంత శుభ తరుణం ఇది.

ఉగాది పచ్చడి.. ఒక మహా ఔషధం!
ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ షడ్రుచుల పచ్చడిని రుచి చూడాలని పండితులు చెబుతుంటారు. అయితే ఇది కేవలం ఆచారమో, సంప్రదాయమో కాదు, అంతకు మించిన ఒక మహా ఔషధం. చాలామంది ఉగాది పచ్చడిని కేవలం పండుగ రోజు మాత్రమే తిని వదిలేస్తారు. కానీ ఆయుర్వేద నిపుణులు, పెద్దలు చెప్పేదాని ప్రకారం.. ఈ ఉగాది పచ్చడిని శ్రీరామ నవమి వరకు (తొమ్మిది రోజులు) లేదా చైత్ర పౌర్ణమి వరకు (పదిహేను రోజులు) రోజూ తీసుకోవాలి.
వాతావరణం వేడెక్కుతున్న ఈ సమయంలో ఇలా 9 లేదా 15 రోజుల పాటు ఉగాది పచ్చడిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇందులో వాడే ప్రధానమైన వేప పువ్వు.. మన కడుపులో పేరుకుపోయిన నులిపురుగులను నాశనం చేస్తుంది.
అంతేకాకుండా ఎండాకాలంలో వచ్చే ఆటలమ్మ, అమ్మోరు వంటి భయంకరమైన వ్యాధులను వేప గాలి, వేప పూత దరిచేరనివ్వవు. ఇక పచ్చడిలో వాడే లేత మామిడి ముక్కలు యాంటీ వైరల్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. మనిషి అనారోగ్యానికి మూలకారణమైన కఫం, వాతం, పైత్యం అనే మూడు దోషాలను ఈ మామిడి అదుపులో ఉంచుతుంది.
శ్లోక పఠనం.. సకల శుభకరం!
ఉగాది పచ్చడిని స్వీకరించేటప్పుడు కేవలం రుచి చూడటమే కాకుండా.."శతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్కలాయచ..సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం" అనే శ్లోకాన్ని పఠిస్తూ ఈ ప్రసాదాన్ని తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
వజ్రం లాంటి దృఢమైన శరీరం, నూరేళ్ల ఆయుష్షు, సకల సంపదలు కలగాలని, సర్వ రోగాలు నశించిపోవాలని కోరుకుంటూ ఈ పచ్చడిని తింటున్నానని ఈ శ్లోకానికి అర్థం.



Click it and Unblock the Notifications
