Latest Updates
-
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి
ప్రపంచాన్ని వణికిస్తున్న డింగా డింగా వైరస్.. మరో కరోనా కాబోతుందా? సైంటిస్ట్స్ ఏం చెప్పారంటే?
కరోనా వైరస్ వల్ల భారీగా నష్టపోయిన ప్రజలకు ఏదైనా కొత్త వైరస్ గురించి చెప్తే చాలా వణికిపోతున్నారు. ఎందుకంటే కరోనా సృష్టించిన విధ్వసం అంత ఇంతా కాదు. ఒక్కొక్కరి జీవితమే సర్వనాశనం అయిపోయింది. అయితే ఇప్పుడు ఉగాండాలో డింగా డింగా అనే వైరస్ సంచలనం సృష్టింస్తుంది. ఈ వైరస్ సోకిన వారు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి సుమారు 300 మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వైరస్ గురించి మరిన్ని విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డింగా డింగా వైరస్
ఇది ఒక మిస్టీరియస్ వైరస్. దీనిని ఉగాండాలో డింగా డింగా వైరస్ అని పిలుస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి సుమారు 300 మంది ఇబ్బందుల పాలయ్యారు. ఇప్పటి వరకైతే మరణాలు నమోదు కాలేదు, కానీ ఈ వ్యాధి సోకినా వారిలో మాత్రం పరిణామాలు తీవ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. బలహీనంగా మారిపోతున్నారు. కనీసం నడవలేకపోతున్నారు కూడా. ఈ వైరస్ ఎలా సోకింది? దీనికి ఎలాంటి చికిత్స అందించాలి అనేది తెలియక అక్కడి ప్రభుత్వం తలలు పెట్టుకుంటోంది.

డింగా డింగా వైరస్ లక్షణాలు
ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం, శరీరం వణికిపోవడం, లేచి నడవలేకపోవడం, తలనొప్పి, దగ్గు, చలి, శరీర నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు వైరస్ బలపడుతున్న కొద్దీ తీవ్రంగా మారుతున్నాయి. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది? ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అక్కడ భారీగా వ్యాపిస్తోంది
ఈ వ్యాధి ఇప్పుడు ఉగాండాలో విస్తృతంగా వ్యాపించింది. ఆ దేశంలో 394 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆ దేశం వెలుపల ఈ వ్యాధి ఎక్కడా కనిపించలేదు. ఈ వ్యాధికి చికిత్స లేదు. లక్షణాల ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
దీన్ని డింగా డింగా అని ఎందుకు అంటారు?
ఈ వైరస్ రాగానే శరీరంపై నియంత్రణ ఉండదు. శరీరం డ్యాన్స్ చేసినట్లు, పూనకం వచ్చినట్లు వణుకుతుంది. ఈ విధంగా శరీరం వణుకుతూ ఆయాసంతో మరణించిన ఘటనలు 1518లో ఫ్రాన్స్‌లో జరిగింది.
ఈ వ్యాధికి ప్రస్తుతం యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తున్నారు. ఈ వ్యాధి ఎక్కడైనా వస్తోందా? ఈ వ్యాధికి కారణమేమిటి? ఏ ఔషధం ప్రభావవంతంగా ఉంటుందో త్వరలో తెలియనుంది.
2019 డిసెంబర్‌లో కూడా ఇలానే
2019లో డిసెంబర్ నెలలో కరోనా వైరస్ కనుగొనబడింది. అప్పుడు దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఆ వైరస్ పెను విధ్వసంసమే సృష్టించింది. అనేక దేశాల్లో లక్షలాది మంది మృతి చెందారు. వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ డింగా డింగా వైరస్ సైతం ఇప్పుడు డిసెంబర్ నెలలోనే వెలుగులోకి రావడం.. 2020వ సంవత్సరం, 2025వ సంవత్సరం కూడా WTF పేరుతో ప్రారంభంకానుండడంతో 2025 మరో 2020 కాబోతోందా అనే అనుమానాలు నెలకొన్నాయి.



Click it and Unblock the Notifications
