Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
సెల్ఫీ పిచ్చి..18 వేల అడుగుల ఎత్తైన మంచు పర్వతం నుండి జారిపడ్డ వ్యక్తి..షాకింగ్ వీడియో
సంతోషమైనా,కష్టమైనా, సుఖమైనా,దు:ఖమైనా ఐదనా సరే సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ధోరణి ఇప్పుడు జనాల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లినా దాని ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం,వాటికి ఎన్ని లైక్స్,వ్యూస్ వస్తాయా అని ఎదురుచూస్తూ ఉండటం చాలామందికి అలవాటు అయింది. ఇదే క్రేజ్ లో పడి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఫొటోలు,వీడియోల కోసం ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టేస్తున్నారు. సెల్పీల మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన చాలామందిని గతంలో చూశాం తాజాగా ఓ వ్యక్తి ఫొటో పిచ్చితో ప్రాణాలు కోల్పోగా అతడు చనిపోయిన విధానం అందిరినీ షాక్ కు గురిచేయడమే కాకుండా భవిష్యత్తులో కెమెరా ముట్టుకోకూడదు అనే స్థాయి ఆలోచనకి నెట్టేసింది.
చైనా దేశంలోని సిచువాన్ ఫ్రావిన్స్ లో మౌంట్ నామా అనే ఎత్తైన పర్వతం ఉంది. దీనిని నామా శిఖరం అని కూడా పిలుస్తుంటారు. ఇది గోంగా పర్వత శ్రేణిలో భాగంగా ఉంది. ట్రెక్కింగ్ మీద ఆశక్తి ఉన్న వ్యక్తులు తగిన పర్మిషన్లు తీసుకొని ప్రతి ఏటా ఈ పర్వతాన్ని ఎక్కి తమ సరదా తీర్చుకుంటారు. అయితే 31 ఏళ్ల హాంగ్ అనే వ్యక్తి సెప్టెంబర్ 25,2025న మౌంట్ నామా అధిరోహించే హైకింగ్ గ్రూప్ లో ఒక సభ్యుడిగా ఉన్నాడు. 18,332 అడుగుల(5,588మీటర్లు)మౌంట్ నామా ఎక్కాలంటే చాలా వ్యవప్రయాసలు పడాల్సిందే. తొలిసారి హైకింగ్ కు రావడంతో హాంగ్ లో ఎక్కడాలేని సంతోషంతో గ్రూపుతో కలిసి మౌంట్ నామా ఎక్కసాగాడు. అయితే మధ్యలో ఒక చోటకు చేరుకున్నాక పక్కన వాలుగా ఉండటంతో ఫొటో తీసుకోవాలని అనే కోరికతో అతడు చేసిన పనిని అక్కడ ఉన్నవాళ్లు కలలో కూడా మర్చిపోలేని విధంగా చేసింది.

ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో..హాంగ్ శిఖరానికి దగ్గరగా మంచుతో కప్పబడిన వాలు దగ్గర తన భద్రతా తాడును విప్పేసి,చేతిలోని మంచు గొడ్డలిని పక్కన పెట్టేసి ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించగా సడెన్ గా బ్యాలెన్స్ తప్పి జారిపోయినట్లు కనిపించాడు. ఏదైనా పట్టుదొరుకుతుందేమోనని పట్టుకునేందుకు అతడు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. కొన్ని మీటర్ల వరకు అతడు పడిపోవడం కనబడగా..తర్వాత ఎటు ఎగిరిపోయాడో కూడా కనబడలేదు.
పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న హైకింగ్ గ్రూప్ లోని మిగతావాళ్లు భయంతో కేకలు వేయడం వీడియోలో కనిపించింది. ఈ ఘటన తర్వాత స్థానిక అధికారులు హాంగ్ కోసం రెస్క్యూ టీమ్ ని పంపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హాంగ్,అతని బృందం వారి హైకింగ్ ప్లాన్ప్ షేర్ చేయలేదని, అవసరమైన అనుమతులు కూడా పొందలేదని స్థానిక అధికారులు చెప్పారు.



Click it and Unblock the Notifications
