Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
మిరపకాయలే అతని ఆహారం..స్నానం కూడా ఎండుమిర్చితోనే..అయినా హెల్దీగానే!
సాధారణంగా మనం పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకొని కొరికితే ఆబ్బా అబ్బో అని కేకలు వేస్తుంటాం. ఇక ఎండుమిర్చి కొరికితే అబ్బో మంట అని ఎగురుతుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం కేజీల కేజీల ఎండుమిరపకాలను అవలీలగా తినేస్తున్నాడు. 10 కేజీల ఎండు మిరపకాయలను కూడా ఎలాంటి కష్టం లేకుండా, కన్నీళ్లు పెట్టుకోకుండా, చెమట పట్టకుండా తినేస్తాడు. ఇతని వీడియో ఒకటి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.
మేఘాలయ రాష్ట్రంలో జైంతియా హిల్స్ లో బటావ్ గ్రామంలో రామ్ పిర్తుహ్(Ram Pirtuh)అనే 50 ఏళ్ల వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. 2011లో రామ్ టాలెంట్ ప్రపంచానికి తెలిసింది. స్థానికంగా తీసిన ఓ వీడియోలో రామ్ ఏకంగా కేజీల కొద్ది ఎండుమిర్చిని తాంటున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపర్చాయి. మేఘాలయ వ్యక్తి 10 కేజీల మిరపకాయలు తినగలడు అనే టైటిల్ తో ఫేస్ బుక్, యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన వీడియోకి పెద్ద ఎత్తున వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలో రామ్ మిరపకాయలను తింటూ మిరపకాయ నా లైఫ్ లో ఒక భాగం..చిన్నప్పటి నుంచే తింటున్నా కాబట్టి నాకేమీ కారంగా అనిపించదు అని నవ్వుతూ చెబుతుండటం కనబడుతుంది.

ఈ వీడియో బయటకు వచ్చాక చాలామంది రామ్ ని టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. రామ్ పై మిరపకాయల పేస్ట్ పోసి స్నానం చేయించారని, చివరికి ఆయన సున్నితమైన భాగాలపై కూడా కారం పూశారని కూడా ప్రచారం జరిగింది. అయినా అతనికి ఎలాంటి అసౌకర్యం కలగలేదని కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ సంచలనాత్మక వాదనలకు ధృవీకరించబడిన ఆధారాలు లేవు. ఇది నిజమా లేక కేవలం అతిశయోక్తా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. అతని గ్రామమైన బటావ్ ప్రజలు మాత్రం రామ్ ఆహారమంతా మిరపమయమే అంటారు. అన్నం, కూర, చివరికి తాగే టీలో కూడా మిరపకాయల ఘాటు ఉండాల్సిందేనట.
మిరపకాయే అతని ఔషధం
రామ్ జీవనశైలి అతన్ని ఒక సూపర్ హీరోలా నిలబెడుతుంది. పొద్దున్నే నిద్రలేచింది మొదలు మిరపకాయల టీతో అతని రోజు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం భోజనంలో మిరపకాయలతో వండిన మటన్ కూర, సాయంత్రం స్నాక్స్ గా పచ్చి మిరపకాయలను నములుతాడు. మిరపకాయే నా ఔషధం. దానివల్ల నాకు ఏ రోగమూ రాదు అని ఆయన ధీమాగా చెబుతాడు.
జయంతియా కొండల్లో మిరప సాగు ఎక్కువగా చేస్తుంటారు. అయినా రామ్ పిర్తుహ్ లాంటి వ్యక్తి మాత్రం ఒక్కడూ లేడు. రామ్ అద్భుత టాలెంట్ వెనుక ఉన్న రహస్యం ఏంటో సైంటిస్టులకే అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం అతని పాత వీడియో కొత్తగా వైరల్ అవుతుంది.



Click it and Unblock the Notifications











