Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
విస్తరి లేకుండా రాళ్లపై భోజనాలు, వర్షాల రాక కోసం ఊరు ఊరంతా వింత ఆచారం
భారతదేశంలో ఎన్నో వింత ఆచారాలు పాటిస్తుంటారు. కొత్తగా చూసే వాళ్లకు వింతగా, విచిత్రంగా అనిపించవచ్చు కానీ పాటించే వారికి ఏమీ అనిపించదు. అలాంటి ఆచారాలు భారత్ లో చాలానే పాటిస్తుంటాయి. ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసిందే. ఒకటీ రెండు రోజులు వాన దేవుడు కరుణించి మళ్లీ పత్తా లేకుండా పోయాడు.
వర్షాకాలంలో కూడా ఎండలు మండిపోతున్నాయి. వరుణ దేవుడి కరుణ కోసం, వర్షాల రాక కోసం దేశవ్యాప్తంగా వివిధ రకాల ఆచారాలు, పూజాది కార్యక్రమాలు పాటిస్తుంటారు. కప్ప పెళ్లిళ్లు, జల యజ్ఞాలు లాంటివి చేస్తుంటారు. వరుణ యాగాలు, పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తుంటారు.

వరుణ దేవుడి కురణ కోసం వింత ఆచారాం:
కానీ కొన్ని ప్రాంతాల్లో వానల కోసం వింత ఆచారాలు పాటిస్తుంటారు. భిన్నమైన పద్ధతుల్లో సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి ఓ వింత ఆచారాన్ని ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల వాసులు వరుణుడు దయ చూపడానికి ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు. ఊరు ఊరంతా కలిసి ఈ సాంప్రదాయాన్ని పాటించడం విశేషం. తమ పంటలు పండేందుకు, దాహార్తిని తీర్చేందుకు వర్షాలు సమృద్ధిగా కురవాలని వాన దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇదంతా చేస్తారు.
500 ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం:
500 ఏళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. మానవ నాగరికతలో అలవాట్లు ఆచారాలుగా మారతాయి. ఆచారాలు సంప్రదాయాలుగా మారతాయి. ప్రతి ఒక్కరూ తమ దైవాన్ని ఆరాధించేందుకు, దైవాన్ని కోరికలు కోరేందుకు బిన్నమైన పద్ధతులు పాటిస్తుంటారు. ఎవరి దారి వారిది. ఎవరి పద్ధతి వారిది. అలా వానలు కురవడానికి కుప్పలకు పెళ్లిళ్లు ఎలా చేస్తారో.. ఇక్కడ చిత్తూరులో కూడా ఇక్కడి స్థానికులు ఈ ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.
విస్తరి లేకుండా రాయిపైనే భోజనం:
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం బెగ్గిలపల్లె పంచాయతీ ప్రజలు వర్షాలు కురవడం కోసం ఇలా ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది.. అంతా కలిసి చిన్న మల్లప్ప కొండపైకి చేరుకుంటారు. అక్కడ కొలువై ఉన్న మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత సామూహిక వంటలు చేస్తారు. వంటవార్పు పూర్తయిన తర్వాత ఎవరికి వారు బండలపై కూర్చొని, కూర్చున్న చోట రాయిని శుభ్రం చేసుకుని విస్తరి లేకుండా రాయిపైనే అన్నం వడ్డించుకుని భోజనం చేస్తారు.
రాళ్లపై భోజనం - వరుణుడు కరుణిస్తాడంటున్న స్థానికులు:
ఈ ఆచారం 500 సంవత్సరాలకు పైగా ఆచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొండపై రాళ్ల మధ్య సామూహికంగా వంటలు చేసుకుని విస్తరి లేకుండా భోజనం చేయడం వల్ల వాన దేవుడు కరుణిస్తాడని, ప్రసన్నమైన వానలు కురిపిస్తాడని భక్తుల నమ్మకం. ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంటారు. ఇలాంటి ఆచారం కేవలం చిత్తూరులోకే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ ఉంది. అక్కడ వర్షాలు కురవడం కోసం 'వరద పాశం' పేరుతో ఆచారాన్ని నిర్వహిస్తారు. ఊరంతా కలిసి గుట్టలపైకి వెళ్లి వంటావార్పు చేసుకుంటారు. అనంతరం అక్కడే విస్తరి లేకుండా భోజనం చేస్తారు.



Click it and Unblock the Notifications