Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
తల్లీ కూతుళ్లకు ఒకరే భర్త, బంగ్లాదేశ్ మండీ తెగలో విచిత్ర సాంప్రదాయం
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. అందులో కొన్ని విచిత్రంగా కూడా ఉంటాయి. కొన్ని ఆచారాలు కనీసం ఊహకు కూడా అందకుండా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది తెగలు ఇప్పటికీ పురాతన సాంప్రదాయాలను పాటిస్తుంటాయి. ఆయా ఆచార వ్యవహారాలు మనకు కొత్తే కావొచ్చు కానీ అక్కడి వారికి అది చాలా సాధారణం. అలాంటి ఓ వింతైన ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

(Image: marieclaire)
బంగ్లాదేశ్, భారత్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉండే మండీ తెగలో ఓ విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అది వింటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటంటే.. అక్కడ తల్లీ కూతుళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లితో పాటు అన్నీ కలిసి చేసుకుంటారు. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా అక్కడి వారు ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
స్త్రీలే ఇంటికి పెద్దలు:
బంగ్లాదేశ్ లోని మారుమూల కొండ ప్రాంతాల్లో, భారత్ లోని సరిహద్దు ప్రాంతాల్లో మండీ తెగ వారు కనిపిస్తుంటారు. ఈ మండీ తెగలో స్త్రీలకే సర్వహక్కులు ఉంటాయి. వారే ఇంటి పెద్దలు. మండీ తెగ మాతృస్వామ్య సమాజం. ఆస్తులు కూడా తల్లి నుంచి కూతుళ్లకు బదిలీ అవుతాయి. ఇంట్లోని అన్ని ప్రధాన నిర్ణయాలు స్త్రీలే తీసుకుంటారు. అలాగే ఓ విచిత్రమైన సాంప్రదాయాన్ని కూడా వాళ్లు ఇప్పటికీ పాటిస్తున్నారు. అదే జాయింట్ మ్యారేజ్. ఇది కుటుంబాన్ని, కుటుంబ ఆస్తిని రక్షించేందు కోసం తీసుకువచ్చిన ఓ సాంప్రదాయం. దీని ప్రకారం తల్లీ కూతుళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లితో పాటు అన్నీ కలిసే చేసుకుంటారు.
జాయింట్ మ్యారేజ్:
మండీ తెగలోని స్త్రీలు ఒకవేళ తమ భర్తలను కోల్పోతే.. కుటుంబ పోషణకు, ఇతర అవసరాలకు మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే వారికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఇతరుల పాలవ్వకుండా ఉండేందుకు ఇతర వ్యక్తులను పెళ్లి చేసుకోరు. అందుకోసమే ఈ జాయింట్ మ్యారేజ్ ఆచారాన్ని తీసుకువచ్చారు. ఈ ఆచారం ప్రకారం.. వితంతువు అయిన మహిళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే.. తన కూతురితో పాటు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అలా ఒకే వ్యక్తిని తల్లీ కూతుళ్లు వివాహం చేసుకుంటారు. ఈ ఆచారం వల్ల ఆస్తి తమ వంశంలోనే ఉండటంతో పాటు పిల్లలను కనడానికి భర్త కూడా ఉంటాడు.
తగ్గిపోతున్న జాయింట్ మ్యారేజెస్:
ఇతర సంస్కృతుల ప్రభావం వల్ల, మహిళలకు చదువు అందుతుండటం వల్ల తెగ ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. జాయింట్ మ్యారేజీలు క్రమంగా తగ్గుతున్నాయని వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటీ మండీ తెగలో తల్లీ కూతుళ్లు ఒకే వ్యక్తిని పెళ్లాడటం అనే ఆచారం ఉందని అంగీకరిస్తున్నారు.



Click it and Unblock the Notifications
