Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కొత్త సంవత్సరాన్ని మొదట ఏ దేశం, చివరగా ఏ దేశం జరుపుకుంటుందో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వారు కొత్త సంవత్సర వేడుకలను మొదట జరుపుకుంటారు, అలాగే ఏదేశం చివరగా జరుపుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరికొన్ని గంటల్లో మనం 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. గత రెండు సంవత్సరాలు అంతంతమాత్రంగానే వేడుకలు జరగ్గా.. ఇప్పుడు మాత్రం అట్టహాసంగా చేసుకునేందుకు అందరూ సిద్ధమైపోయారు. మనం రాత్రి 12 గంటలకు వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటికే కొన్ని దేశాల వారు 2023 సంవత్సరంలోకి అడుగుపెట్టేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వారు కొత్త సంవత్సర వేడుకలను మొదట జరుపుకుంటారు, అలాగే ఏదేశం చివరగా జరుపుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ దేశం ముందుగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తుంది?
ఓషియానియా ప్రపంచంలోని నూతన సంవత్సర వేడుకలను ముందుగా గుర్తించే ప్రదేశం. టోంగా, కిరిబాటి, సమోటినీ పసిఫిక్ ద్వీప దేశాలు ప్రపంచంలోనే మొట్టమొదటగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి. అక్కడే న్యూ ఇయర్ వేడుకలు మొదట జరుగుతాయి.
ఇండియాలో మధ్యాహ్నం 3.30 అవుతున్నప్పుడే ఈ దేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాయి.
అలాగే న్యూజిలాండ్ వాసులు కూడా భారత్‌లో మధ్యాహ్నం 4.30 గంటలకే కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతారు.

ఏ దేశం చివరిగా జరుపుకుంటుంది?
యునైటెడ్ స్టేట్స్‌కు దగ్గరగా, జనావాసాలు లేని ద్వీపాలు- బేకర్ ద్వీపం, హౌలాండ్ వాసులు న్యూ ఇయర్‌ను చివరగా జరుపుకుంటారు. భారత్‌లో జనవరి 1వ తేదీ సాయంత్రం 5.30 గంటలు అవుతున్నప్పుడు వాళ్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతారు.

ఏయే దేశాల్లో ఎప్పుడంటే..
* సూర్యోదయం మొదటడా జరుగుతుందని పేరున్న జపాన్.. ఇండియాలో మధ్యాహ్నం 3.30 అవుతున్నప్పుడే జపాన్ న్యూ ఇయర్‌లోకి అడుగుపెడుతుంది.
* దక్షిణ కొరియా, ఉత్తర కొరియా కూడా మధ్యాహ్నం ఇండియాలో 3.30 గంటలు అవుతున్నప్పుడే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాయి.
* ఆస్ట్రేలియాలో మనకంటే ఐదున్నర గంటల ముందే న్యూ ఇయర్‌లోకి అడుగుపెడుతుంది.

రష్యాలో రెండు సార్లు
రష్యాలో కొత్త సంవత్సరం వేడుకలు రెండు సార్లు జరుగుతాయి. జనవరి 1వ తేదీన(కొత్త క్యాలెండర్ ప్రకారం) ఒకసారి, జనవరి 14వ(పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం) కొత్త సంవత్సరాన్ని అక్కడి ప్రజలు జరుపుకుంటారు.
ఈ దేశాల్లో న్యూ ఇయర్ వేరే తేదీల్లో..
చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాల్లో న్యూ ఇయర్‌ను జనవరి 1వ తేదీన జరుపుకోరు. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ కొత్త సంవత్సర వేడుకలు జరుగుతుంటాయి.



Click it and Unblock the Notifications