Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
ఎడారిలో ఉండే ఒంటె పాలు ఎప్పుడైనా తాగారా. ఆ అవకాశం చాలా మందికి వచ్చి ఉండదు కాబట్టి తాగి ఉండరు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఒంటె పాలకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. ఆవు పాలతో ఒంటె పాలు పోటీపడుతుంది. ఇంకొన్నేళ్లలో అందరూ ఒంటె పాల కోసం ఎగబడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయ్. అరబ్ దేశాల్లో ఒంటె పాలు తాగడం చాలా సాధారణం, అక్కడ అన్ని కిరాణా కొట్టుల్లో ఒంటెపాలను ఇక్కడ ఆవు పాలు అమ్మినట్లుగా ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతారు.
ఆవుపాలతో ఒంటెపాలు పోటీ
2050 నాటికి పాశ్చాత్య దేశాల్లో ఆవుపాలతో సమానంగా ఒంటెపాలను కొని తాగే పరిస్థితి వస్తుందంటున్నారు. ఒంటె పాలు ఖరీదు కావడం డిమాండ్ కూడా అధికంగా ఉండడంతో ఒంటెల షెడ్లు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసి ఒంటెల డైరీ ఫీర్మ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఒంటెలకే తట్టుకునే శక్తి
భూమిపై మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి ఆవుల కన్నా ఒంటెలకే ఎక్కువ ఉన్న కారణంగా ఒంటెలకే ప్రాధాన్యత పెరుగే అవకాశం ఉందంటున్నారు. తీవ్రమైన ఎండలను తట్టుకునే శక్తి ఆవులకు ఉండదు. కానీ ఒంటెలకు సహజంగా ఆ ఎండను, తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్ధ్యం ఉంటుంది. అవి పుట్టి పెరిగేదే ఎడారిలో కాబట్టి వాటికి ఏయిర్ కండీషనర్లు కూడా అవసరం లేదంటున్నారు.

ఉత్పత్తి ఖర్చు తక్కువ
ఒక లీటరు పాలను ఉత్పత్తి చేయడంలో ఒంటెలకు వేసే మేత, ఆవులకు వేసే మేత పోల్చుకుంటే ఒంటెలకు తక్కువ మేత పడుతుందని చెబుతున్నారు.
పోషకవిలువల విషయానికి వస్తే ఒంటె పాలల్లోనే విటమన్ సి, ఐరన్ కంటెంట్ ఆవు పాలల్లో కన్నా ఎక్కువ ఉన్నట్లు కనుగ్గొన్నారు. కొవ్వు తక్కువ కావాలనుకున్నవారు కూడా ఒంటెపాల వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఉంది.
పోషకవిలవలు ఎక్కువ
ఇక మాంసం విషయంలో ఆఫ్రికా, అరబ్ దేశాల్లో ఆవు మాంసానికి బదులుగా ఒంటె మాంసానికే ప్రధాన్యతనిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఒంటె మాంసంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండడమేనని అంటున్నారు.
పెరుగుతున్న ఒంటెల డైరీ ఫామ్‌లు
అమెరికా, యూకె, యూరప్ లాంటి దేశాల్లో ఒంటెల డైరీ ఫామ్‌లు విజయవంతంగా నడుస్తుండడంతో ఆవుల డైరీ ఫామ్‌లు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఎన్ని విధాలుగా పరిశీలనలు చేసినా ఆవు డైరీలకన్నా ఒంటె డైరీలకు మాత్రమే అనుకూల పరిస్థితులు, లాభాలు ఎక్కువగా ఉన్నట్లు తేలుతోందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అరియెల్ చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
