Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Makar Sankranthi 2023: సంక్రాంతికి పతంగులకు ఏంటి సంబంధం? పొంగల్‌కు ఎందుకు ఎగురవేస్తారు?
సంక్రాంతి వచ్చిందంటే పలు ప్రాంతాల్లో జోరుగా పతంగులు ఎగురవేస్తుంటారు. అసలు సంక్రాంతికి పతంగలు ఎందుకు ఎగురవేస్తుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర సంక్రాంతి భారత్‌లో పెద్ద పండగల్లో ఒకటి. హిందూమతంలో సంక్రాంతికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి రోజును వసంత రుతువుకు ఆగమనంగా చూస్తారు. అలాగే సంక్రాంతిని చలికాలానికి ముగింపుగా చూస్తారు. మకర సంక్రాంతిని ఒక్కో చోట ఒక్కోలా జరుపుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే పలు ప్రాంతాల్లో ఆకాశంలో ఎటు చూసినా పతంగులే కనిపిస్తుంటాయి.

సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందేలు ఎంత ఫేమస్సో.. తెలంగాణ, హైదరాబాద్‌లో పతంగులు అంత ఫేమస్. జనవరి మొదలైనప్పటి నుండి పతంగులు ఎగరాల్సిందే. హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో పతంగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పాతబస్తీ, దాని చుట్టు పక్కల ప్రాంతాలు, ట్యాంక్‌బండ్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆకాశం నిండా పతంగులే కనిపిస్తాయి.

సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు?
* సంక్రాంతిని వసంత రుతువు ప్రారంభానికి సూచికగా చూస్తారు. ఈ రోజు సూర్యుడి లేతకిరణాలు చర్మంపై పడితే చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
* గాల్లో పతంగులు ఎగురవేయడం అనేది దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక మార్గం అని కొందరు విశ్వసిస్తారు.
* పతంగులు ఎగురవేయడం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పతంగులు చాలా పెద్ద ఎత్తున ఎగురవేస్తుంటారు. ఈ రాష్ట్రాల్లో గాలిపటాలు ఎగురవేయడాన్ని పండగలా భావిస్తారు.
* పతంగులు ఎగురవేయడాన్ని మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవడం విశేషం.
* ఉత్తరాయణ పండుగ సందర్భంగా ఆరు నెలల సుదీర్ఘ నిద్ర నుండి దేవతలు మేల్కొంటారని, వారికి అదృష్టాన్ని మరియు శ్రేయస్సును అందించినందుకు కృతజ్ఞతగా చేతితో తయారు చేసిన గాలిపటాలను ఎగురవేస్తారని గుజరాత్ ప్రజలు విశ్వసిస్తారు.

పతంగి చరిత్ర:
భారత్‌లోకి గాలిపటం 14వ శతాబ్దంలోనే వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. గుజరాత్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండగ ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేస్తారు.

జనవరిలోనే ఎందుకు ఎగురవేస్తారు?
జనవరిలో గాలిపటాలను ఎందుకు ఎగురవేస్తారంటే.. ఈ సమయంలో గాలిపటాలను ఎగురవేయడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటంతో పాటు ఒక వైపు నుండి గాలి వీస్తుంది. ఇలా వీయడం వల్ల పతంగులు సులువుగా ఎగురుతాయి. తొలి దశలో వివిధ ఆకారాల్లో సైనిక అవసరాలకు ఈ పతంగులను వాడేవారు. అక్కడి నుండే ఈ సంస్కృతి ఇతర దేశాలకు పాకింది.

హైదరాబాద్ పతంగి:
చాలా ప్రాంతాల్లో పతంగులు ఎగురవేస్తారు కానీ హైదరాబాద్‌కు పతంగికి ప్రత్యేక సంబంధం ఉంది. హైదరాబాద్‌లో పతంగులను జోరుగా ఎగురవేస్తుంటారు. ఇక్కడ పతంగులను ఎగురవేయడంలో కులమత భేదాలేవీ ఉండవు. అందరూ కలిసి పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్, పాతబస్తీ ప్రాంతాల్లో పతంగులు ఎక్కువగా ఎగురవేస్తుంటారు. హైదరాబాద్‌లో ఏటా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. సంక్రాంతి పండగ సందర్భంగా మూడ్రోజుల పాటు కైట్ ఫెస్టివల్ పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. కరోనా వేళ నిర్వహించలేదు. ఈ కైట్ ఫెస్టివల్‌కు వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ వస్తుంటారు. భారీగా ఉండే పతంగులు గాలిలో ఎగురుతుంటే నోళ్లప్పగించి చూస్తూ ఉండిపోతాం.



Click it and Unblock the Notifications