Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
May Day 2024 : మేడే ను ఎందుకు జరుపుకుంటామో తెలుసా.. మేడే లేకపోతే..?
ప్రపంచ వ్యాప్తంగా మే 1న శ్రామికుల, కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ మేడే ఎప్పుడు మొదలైంది. కార్మికులు ఎందుకు మేడేను సంబరంగా జరుపుకుంటారు. కార్మికుల జీవితాల్లో మేడే తీసుకువచ్చిన మార్పులు ఏంటి ? ఇలాంటి కొన్ని ప్రశ్నలను చాలా మందిని వేధిస్తుంటాయ్. మేడేకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
షికాగోలో పుట్టిన మేడే
ప్రస్తుతం ప్రపంచంలోని శ్రామికులందరూ రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారంటే అది 1886లో కార్మికులు చేసిన పోరాటం వల్లే. 1886లో షికాగోలోని హే మార్కెట్లో కార్మికులందరూ కలిసి తమకు రోజుకు ఎనిమిది గంటల పనిని మాత్రమే కేటాయించాలని అన్నారు. అక్కడి ప్రభుత్వం ఈ పోరాటాన్ని తీవ్రంగా అణచడానికి ప్రయత్నాలు చేసింది. పోలీసులు కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొందరు శ్రామికులు అక్కడికక్కడే మరణించారు. తరువాత అదే సంఘటన 1890లో బ్రిటెన్‌లో చోటుచేసుకుంది. బ్రిటెన్‌లోని హైడ్ పార్క్‌లొో సుమారు 3 లక్షల మంది కార్మికులు తమకు రోజుకు 8 గంటల పనిని కల్పించమని డిమాండ్ చేశారు.

చికాగోలో పుట్టిన కార్మిక ఆద్యమం క్రమంగా అన్ని దేశాల్లోకి పాకింది. చాలా దేశాల ప్రభుత్వాలు 8 గంటల పనిని అంగీకరించి కార్మికుల డిమాండ్‌కు తలొగ్గాయ్. ఇక అప్పటి నుంచి 1886లో చికాగో కార్మిక పోరాటంలో మృతి చెందిన కార్మికులను స్మరించుకుంటూ మే1న కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో మేడే
మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో మేడే రోజు అంటే మే1న యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేసేవారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం మే1ని సెలవు దినంగా, కార్మిక దినోత్సవంగా చేస్తూ చాలా దేశాలు మేడేను జరుపుకున్నాయ్. కార్మికులకు సంబంధించిన చాలా సంక్షేమ పధకాలు మే1వ తేదీనే అమల్లోకి వచ్చాయ్.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది శ్రామికులు ఉన్నారంటే..?
ప్రపంచవ్యాప్తంగా 2022 వరకు ప్రపంచ జనాభా 795 బిలియన్లుగా ఉంది. వీరిలో మొత్తం శ్రామికుల సంఖ్య 3.9 బిలియన్లను ప్రపంచ బ్యాంక్ అధికారిక లెక్కలు చెబుతున్నాయ్. అయితే ఇంట్లో ఆడవారు లెక్కలేనంత పని చేస్తారు. ఉద్యోగం చేసే మహిళలు కూడా ఇంటికి వచ్చి మళ్లీ ఇంట్లోని పనులన్నీ చేసుకుంటారు. ఇలా ఎంతో మంది ఆడవారి శ్రమను లెక్కకట్టడం లేదని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ్.



Click it and Unblock the Notifications
