Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
ఆచార్య చాణక్యుడు ఒక మనిషి ఎలా బతకాలి, జీవిత సిద్ధాంతాలను తన నీతి శాస్ర్రంలో అనేక విషయాలు వివరించారు. జీవితంలో సరైన మార్గంలో నడిచేందుకు ఆయన సూత్రాలు ఎంతగానో దోహదపడతాయని ప్రజలు విశ్వసిస్తారు. ఈ క్రమంలో చాణక్య నీతి శాస్త్రం ప్రకారం ఆడవారిలో ఉండే కొన్ని గుణగణాలు, అలవాట్లు వారిని మెట్టినింటికి మహాలక్ష్మిగా చేస్తాయని చెబుతున్నాయి. ఆ లక్షణాలతోనే వారిని సూపర్ వుమెన్‌గా అందలం ఎక్కిస్తారు. ముఖ్యంగా స్త్రీలలో ఉండే ఈ నాలుగు లక్షణాలు కుటుంబానికి మేలు చేస్తాయి.

కష్ట సమయాల్లో ఓర్పుగా ఉండటం..
చాణక్య నీతి ప్రకారం.. కష్ట సమయాల్లో ఓర్పు, సంయమనం పాటించే మహిళలు కుటుంబానికి గొప్ప బలంగా నిలుస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆందోళన చెందకుడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా సంక్షోభం నుంచి బయటపడేందుకు తమ సామర్థ్యాలు, తెలివితేటలు, సమయస్ఫూర్తితో కృషి చేస్తారు. ఇలాంటి స్వభావం గల మహిళలకు.. కుటుంబంలో, సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దే నేర్పు
ఇంటి యజమాని డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడతారో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆ కష్టాన్ని అర్థం చేసుకుని ఆ డబ్బు విలువని తెలుసుకుని.. దానిని తెలివిగా ఉపయోగించగలగాలి. సంపాదనలో కొంత పొదుపు చేయగలగాలి. ఇంటి ఖర్చులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే అనసరమైన ఖర్చులను నివారించగలగాలి. ఇలాంటి మహిళలు తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసి భవిష్యత్తులో ఆర్థిక సవాళ్ల నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది.

కుటుంబంలో ఐక్యత
ఏ ఇంట్లో అయినా చిన్నపాటి గొడవలు, అభిప్రాయ భేదాలు తలెత్తడం సహజమే. అలాంటి పరిస్థితుల్లోనూ కుటుంబం మొత్తాన్ని ఏకం చేసే సామర్థ్యం, సంబంధాలకు విలువ ఇచ్చే మహిళలను ఇంటి లక్ష్మిగా గౌరవిస్తారు. కటుంబంలో ప్రేమ, గౌరవం, పరస్పర నమ్మకాన్ని నిలబెడతారు. అలాంటి స్త్రీలు కుటుంబం విడిపోకుండా రిలేషన్‌షిప్స్‌ను కాపాడతారు. వీరు ప్రతి ఇంటికీ దృఢమైన స్తంభాలుగా నిలుస్తారు.
పిల్లలకు సరైన విద్య
కుటుంబ, సమాజ భవిష్యత్తుకి భావితరాలు పటిష్ఠంగా ఉండాలి. నేటి పిల్లలే రేపటి పౌరులు. వారు చదువు, జ్ఞానం, సంస్కారంపై దృష్టి సారించే తల్లులు.. వారి భవిష్యత్తుకి బలమైన పునాది వేస్తారు. పెద్దయ్యాక కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా మోయగలరు. సమాజంలో మంచి గుర్తింపు పొందగలరు. తమ పిల్లలను సరైన మార్గంలో నడిపించే తల్లులను ఉత్తమ మహిళలుగానే కాదు సూపర్ ఉమెన్‌గా గౌరవిస్తారు.



Click it and Unblock the Notifications
