World chocolate day: తినే చాక్లెట్ ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయవచ్చు..ఎలాగంటే..

ప్రతి ఏటా జూన్ 7న ప్రపంచ చాక్లెట్ దినోత్పవం నిర్వహించబడుతుంది. చాక్లెట్ తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దీనిని ఏటా నిర్వహిస్తుంటారు. ఈ రోజు కేవలం నోరు తీపి చేసుకోవడానికే కాదు.. ఒక్కో చాక్లెట్ ముక్క కొరుకుతూ, మీ గురించి మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా. మీరు ఇష్టపడే చాక్లెట్ ఫ్లేవర్‌ కి, మీ వ్యక్తిత్వానికి మధ్య ఓ రహస్య బంధం ఉంటుందని మీకు తెలుసా?.. జర్నల్ ఆఫ్ ఫుడ్ రీసెర్చ్ 2023లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 72శాతం మంది ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా డెజర్ట్‌ లు, చాక్లెట్ల విషయంలో వారి వ్యక్తిత్వ లక్షణాలతో చాలా దగ్గరగా సరిపోలాయని తేలింది. మీ ఫేవరెట్ చాక్లెట్ మీ వ్యక్తిత్వాన్ని ఎలా బయటపెడుతుందో ఇక్కడ చూడండి.

మిల్క్ చాక్లెట్ ఇష్టపడేవాళ్లు ఇలా ఉంటారు

స్నేహశీలి, దయగలవారు, పాత జ్ఞాపకాలను ఇష్టపడతారు, అందరితో కలిసిపోతారు. వీరు సౌకర్యానికి, సరళతకు, బలమైన బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి. సలహాల కోసం లేదా మానసిక ధైర్యం కోసం స్నేహితులు మీ దగ్గరికే వస్తారు. సంప్రదాయాలను కొనసాగించడాన్ని ఇష్టపడతారు. అందుకే ఫ్రెండ్స్ గ్యాంగ్‌ లో అందరినీ కలిపి ఉంచే కీలక వ్యక్తిగా వీరే ఉంటారు. మోండెలెజ్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 47శాతం మంది మిల్క్ చాక్లెట్‌ నే ఎంచుకుంటారట. అందుకే ఇది అత్యంత ప్రజాదరణ పొందిన చాక్లెట్.

World Chocolate Day 2025 Decode Your Personality by Your Favourite Chocolate

వైట్ చాక్లెట్ ప్రియులు

సృజనాత్మకత, కళాత్మకత, కొత్తదనం, స్వేచ్ఛాయుత స్వభావం కలిగి ఉంటారు. వీరు ఇష్టపడే చాక్లెట్‌ లాగే (టెక్నికల్ గా ఇది నిజమైన చాక్లెట్ కాదు)వీరిని కూడా తరచుగా అపార్థం చేసుకుంటారు. వీరు నియమాలను పాటించే రకం కాదు. ప్రత్యేకమైన ఆలోచనలతో, ఫ్యాషన్ సెన్స్‌ తో ఇతరులను ఆశ్చర్యపరచడం వీరికి చాలా ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 శాతం మంది మాత్రమే వైట్ చాక్లెట్‌ ను ఇష్టపడతారు. 2024 మింటెల్ స్టడీ ప్రకారం జెన్-Z యువతలో ముఖ్యంగా ఆగ్నేయాసియాలో దీనికి ఆదరణ పెరుగుతోంది.

కారమెల్ చాక్లెట్ లవర్స్
కరుణ, విధేయత, మల్టీ-టాస్కింగ్, బ్యాలెన్సింగ్ వంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఇతరుల భావోద్వేగాలను బాగా అర్థం చేసుకుంటారు, వారి అవసరాలకు సున్నితంగా స్పందిస్తారు, ఇతరుల పట్ల శ్రద్ధ చూపిస్తారు. కానీ ఆ సున్నితత్వం వెనుక ఒక పదునైన తెలివి ఉంటుంది. ఒకేసారి అనేక బాధ్యతలను చెమట పట్టనంత సులువుగా నిర్వహిస్తారు. ఓ పోల్ ‌లో తమను తాము భావోద్వేగపరులం కానీ లక్ష్యం వైపు దూసుకెళ్తాం అని చెప్పేవారు ఎక్కువగా కారమెల్ చాక్లెట్లను ఇష్టపడతారని తేలింది.

Take a Poll

నట్స్ చాక్లెట్ తినేవారు
ప్రాక్టికల్, సాహసోపేత, శక్తివంతమైన, వాస్తవిక దృక్పథం కలిగి ఉంటారు. వీరు జీవితంలో కొత్తదనాన్ని, సర్‌ప్రైజ్‌ లను ఆస్వాదిస్తారు. బాదం, హాజెల్‌ నట్ లేదా పీనట్ బటర్ ఉన్న చాక్లెట్ అయినా మీరు కేవలం చాక్లెట్‌ లో నమలడానికి ఇష్టపడటమే కాదు జీవితంలోని సమస్యలను కూడా నమిలి పరిష్కరించడానికి ఇష్టపడతారు. పనులను చేతితో చేయడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో మీరు దిట్టగా ఉంటారు. యూగవ్ సర్వే ప్రకారం నట్స్ ఉన్న చాక్లెట్ తినేవారు వ్యాపారవేత్తలు కావడానికి, ఉదయాన్నే నిద్రలేవడానికి ఎక్కువ అవకాశం ఉందట.

డార్క్ చాక్లెట్ అభిమానులు
అధునాతన అభిరుచి, లోతైన ఆలోచన, ఆరోగ్యంపై శ్రద్ధ, అంతర్ముఖులుగా ఉంటారు. డార్క్ చాక్లెట్ తినేవారికి అది కేవలం రుచికి సంబంధించిన విషయం కాదు, వారి జీవనశైలిలో భాగం. మీకు డార్క్ చాక్లెట్ చేదు రుచి నచ్చుతుందంటే మీరు ఎక్కువగా మీ గురించి మీరు ఆలోచించుకుంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు, బంధాలలో సంఖ్య కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నేషనల్ కాన్ఫెక్షనర్స్ అసోసియేషన్ ప్రకారం డార్క్ చాక్లెట్ తినేవారు ఒంటరిగా ప్రయాణించడం, ధ్యానం చేయడం, జాజ్ సంగీతం వినడం వంటివి ఎక్కువగా ఇష్టపడతారట.డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే వీరు ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటారు.

World Chocolate Day 2025 Decode Your Personality by Your Favourite Chocolate

చిల్లీ లేదా ఎగ్జాటిక్ ఫ్లేవర్ చాక్లెట్ ప్రియులు
రిస్క్ తీసుకునే తత్వం, అందరితో కలివిడిగా ఉండటం, కొత్త విషయాల పట్ల ఆసక్తి, నిర్మొహమాటంగా ఉంటారు. మిరపకారం, సాల్ట్ లేదా లావెండర్ వంటి విభిన్న ఫ్లేవర్లు ఉన్న చాక్లెట్లను మీరు ఎంచుకుంటున్నారంటే మీరు గుంపులో గోవిందా అనే రకం కాదు. ఆహారం నుండి ఫ్యాషన్ వరకు, స్నేహంలో కూడా థ్రిల్, స్పైస్ కోరుకుంటారు. యూరోమానిటర్ ప్రకారం 2022 నుండి ఎగ్జాటిక్ ఫ్లేవర్ చాక్లెట్ అమ్మకాలు 35 శాతం పెరిగాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మిలీనియల్స్, జెన్-Z వినియోగదారులు వీటిని ఎక్కువగా కొంటున్నారు.

చాక్లెట్ ఎంపికల వెనుక సైకాలజీ
చాక్లెట్లు ముఖ్యంగా డార్క్, మిల్క్ వేరియంట్లు తిన్నప్పుడు మన మెదడులో డోపమైన్ స్థాయిలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తాత్కాలిక ఆనందం దీర్ఘకాలిక మానసిక స్థితికి, వ్యక్తిత్వానికి ముడిపడి ఉంటుంది. మన కోరికలు మన భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి.. ఒక వ్యక్తి పదేపదే వైట్ చాక్లెట్ తింటున్నాడంటే వారు సౌకర్యం, గుర్తింపు కోరుకుంటున్నారని అర్థం.. అదే డార్క్ చాక్లెట్ ప్రియులు నియంత్రణ, ప్రశాంతతను కోరుకుంటారు అని ఓ ఫుడ్ సైకాలజిస్ట్ చెబుతున్నారు.

Story first published: Monday, July 7, 2025, 12:18 [IST]
Desktop Bottom Promotion