Latest Updates
-
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి
మెడలో పాములే హారాలు..ఒళ్లు గగుర్పొడిచే నాగ పంచమి వేడుక..వీడియోలు చూడండి
ప్రతి ఏటా జులై16వ తేదీని ప్రపంచ పాముల దినోత్సవం(World snake day)గా జరుపుకుంటారు. పాముల గురించి ప్రజల్లో అవగాహన పొంచడానికి,పాములపై ప్రజల్లో ఉన్న భయాలు,అపోహలు తొలగించి వాటి ప్రాముఖ్యతను తెలియజేయడం ద్వారా వాటిని రక్షించాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడం దీని లక్ష్యం. వాస్తవానికి పాములు పర్యావరణ వ్యవస్థలో చాలా కీలక పాత్రనే పోషిస్తాయి. క్రిమికీటకాలు వంటి వాటిని అవి తింటూ పంటలను రక్షిస్తాయి. ఒకరంగా అవి రైతులకు మేలే చేస్తుంటాయి. మరోవైపు,పాముకాటు మరణాలు కూడా మనదేశంలో ఎక్కువగానే నమోదవుతుంటాయి,ప్రతి ఏటా వేలాది మంది ప్రజలు పాముకాటుకు గురై మరణిస్తున్నారు. దీంతో పాము అంటేనే చాలామంది పరుగెడతారు,వీటి గురించి భయం,అపోహలు ఉంటాయి. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు.
నాగపంచమి రోజున పాములకు లేదా పుట్టలో పాలు పోసే సంప్రదాయం గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనదేశంలోని ఓ గ్రామంలో మాత్రం వందలాది విషపు పాములను పుట్టలు,నదుల్లో,అడవుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాటితో ఆటలాడుకుంటారు. ప్రాణం ఉన్న పాములను మెడలో హారాలుగా వేసుకొని, వాటితో ఆడుకుంటూ, చేతుల్లో పట్టుకొని ఊరేగుతారు. సర్పదోషాల నుంచి రక్షించే దేవతగా కొలిచే 'విషహరి' అమ్మవారిని ప్రార్థిస్తూ, పాములను మెడలో దండలుగా చుట్టుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోతారు.

నాగపంచమి సందర్భంగా బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలోని విభూతిపూర్ లో నాగ పంచమి రోజున జరిగే ఈ పాముల ఉత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం అక్కడికి వస్తారు. గత 300 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది..గ్రామస్థులు దీనిని పూర్తి ఉత్సాహంతో నిర్వహిస్తారు. ఈ గ్రామాన్ని ప్రజలు పాముల గ్రామం అని కూడా చుట్టుపక్కల ప్రజలు పిలుస్తుంటారు. దీనికి కారణం ఇక్కడి ప్రజలు తమ సంప్రదాయాన్ని అనుసరించడానికి తమ ప్రాణాలను కూడా పట్టించుకోరు.
ఈ ఉత్సవాలు సింఘియా బజార్ లోని భగవతి మాత ఆలయంలో ప్రార్థనలతో మొదలవుతాయి. ఆ తర్వాత భక్తులు ఊరేగింపుగా సింఘియా ఘాట్ కు చేరుకుంటారు. అక్కడ వారి విశ్వాసానికి, నిర్భయత్వానికి పరీక్షగా కొందరు భక్తులు పాములను నోట కరచుకొని చేసే సాహసాలు చూపరులను నివ్వెరపరుస్తాయి. అనంతరం పాములను చేతుల్లో పట్టుకొని నదిలోకి దిగి, అమ్మవారి నామాన్ని జపిస్తూ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పూజలు ముగిశా, ఆ సర్పాలను భక్తిశ్రద్ధలతో తిరిగి అడవిలో వదిలిపెడతారు.
కోరికలు తీర్చే తల్లిగా విశ్వాసం
స్థానికులు ఇది కేవలం పండగ కాదని, తమ వారసత్వమని గర్వంగా చెబుతారు. నిష్కల్మషమైన భక్తితో వచ్చే భక్తుల కోరికలను విషహరి మాత తీరుస్తుందని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా, సంతానం కోసం ఎదురుచూసే మహిళలు అమ్మవారిని వేడుకుంటే పిల్లలు పుడతారని నమ్ముతారు. అందుకే కేవలం సమస్తిపూర్ జిల్లా నుంచే కాకుండా ఖగారియా, సహర్సా, బేగుసరాయ్, ముజఫర్‌పూర్ వంటి సమీప జిల్లాల నుంచి కూడా భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనడానికి తరలివస్తారు.
గ్రామంలో నివసించే రౌబీ దాస్ భగవతికి గొప్ప భక్తుడు. అతను మొదట ఈ ప్రదేశంలో నాగ పంచమి సందర్భంగా ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అప్పటినుంచి అతని వారసులు, గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే ముందు ఈ గ్రామంలో నాగ పంచమి పండుగ జరుపుకుంటారు.ఇక్కడ నాగ పంచమి పండుగను మిథిలా పంచాంగ్ ఆధారంగా జరుపుకుంటారు. మిథిలా పంచాంగ్ ప్రకారం ఈసారి నాగ పంచమిని 15వ తేదీన జరుపుకోగా..దేశవ్యాప్తంగా జూలై 29న నాగ పంచమి పండుగ జరుపుకుంటారు.
ఈ సంప్రదాయం పర్యావరణ ప్రాముఖ్యత ఏమిటి?
నాగ పంచమి నాడు జరిగే సర్ప ఉత్సవం గురించి గ్రామస్తులు చెబుతూ పాములు ప్రకృతిలోని మీథేన్ వాయువును గ్రహిస్తాయని, ఇది పర్యావరణ సమతుల్యతకు ముఖ్యమైనదిగా భావిస్తారు. సనాతన ధర్మంలో ఈ ప్రాముఖ్యతను గుర్తించడానికి, ప్రకృతితో సామరస్యాన్ని కొనసాగించడానికి పాములను పూజిస్తారు. శివుడు, తాంత్రికులతో పాముల అనుబంధం ఈ సహజ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.



Click it and Unblock the Notifications
