Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
బంగారం ధరల పెరుగుదలపై బ్యాంక్ ఆఫ్ అమెరికా షాకింగ్ నివేదిక.. ఈ ఏడాది పసిడి పెరుగుదల ఎలా ఉంటుందంటే..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం హాట్ టాఫిక్ గా మారింది. మునుపెన్నడూ లేని స్థాయిలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు బంగారం గురించి ఆలోచించాలంటేనే వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి ప్రియులు ఈ ధరల పెరుగుదల చూసి లబోదిబోమనే పరిస్థితి నేడు కనిపిస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే భవిష్యత్ బంగారం ధరల పెరుగుదలపై పలు సంస్థలు ఇస్తున్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే గోల్డ్ మాన్ సాచ్స్ నివేదిక తన అంచనాలను విడుదల చేయగా తాజాగా బ్యాంక్ ఆఫ్ అమెరికా (BoA) కూడా అంచనాలను వెలువరించింది.
ఈ బ్యాంక్ అంచనా ప్రకారం.. 2026 వసంతకాలం (మార్చి - ఏప్రిల్ - మే) నాటికి బంగారం ధర ఔన్సుకు 6 వేల డాలర్లకు చేరవచ్చని బ్యాంక్ అంచనా వేయడం ప్రపంచ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఇప్పటివరకు ప్రధాన ఆర్థిక సంస్థ ఇచ్చిన అత్యంత బుల్లిష్ బంగారం అంచనాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకుడు మైఖేల్ హార్ట్‌నెట్ ప్రకారం.. గత చరిత్రను పరిశీలిస్తే బంగారం బుల్ మార్కెట్లలో సగటున 43 నెలల వ్యవధిలో దాదాపు 300 శాతం పెరుగుదల చూపించింది. చరిత్ర భవిష్యత్తుకు పూర్తిస్థాయి మార్గదర్శకం కాకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో Gold మరో భారీ ర్యాలీ దిశగా కదులుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లెక్కల ప్రకారం... వచ్చే వసంతకాలం నాటికి బంగారం ధర 6 వేల డాలర్ల స్థాయిని చేరడం అసాధ్యం కాదని BoA భావిస్తోంది.
బంగారంపై ఈ సానుకూల దృక్పథానికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిగా.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెట్టుబడిదారులను సురక్షితమైన ఆస్తుల వైపు నడిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం సంప్రదాయంగా ఒక బలమైన హెడ్జ్‌గా నిలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా లోహాల పరిశోధన విభాగాధిపతి మైఖేల్ విడ్మెర్ కూడా 2026లో బంగారం పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలలో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
ఇంకొక ముఖ్యమైన అంశం సరఫరా వైపు కనిపిస్తున్న ఒత్తిడి. ఉత్తర అమెరికాలోని ప్రధాన బంగారు గనుల ఉత్పత్తి 2025తో పోలిస్తే 2026లో తగ్గే అవకాశం ఉందని BoA అంచనా వేస్తోంది. అదే సమయంలో గనుల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి. ఆల్-ఇన్ సస్టైనింగ్ ఖర్చులు ఔన్సుకు దాదాపు 1,600 డాలర్లకి చేరవచ్చని అంచనా. ఇది బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
ఇక డిమాండ్ పరంగా చూస్తే.. పెట్టుబడిదారుల ఆసక్తి వేగంగా పెరుగుతోంది. 2025లో బంగారం ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి వచ్చిన పెట్టుబడులు గత కొన్ని సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులు బంగారాన్ని మళ్లీ తమ పోర్ట్‌ఫోలియోలలో చేర్చుకోవడం ప్రారంభించారు. అయితే, అధిక-నికర విలువ గల పెట్టుబడిదారులు మరియు కొన్ని సంస్థాగత పెట్టుబడిదారులు ఇంకా బంగారంలో తక్కువ కేటాయింపే కలిగి ఉన్నారని BoA సూచిస్తోంది. ఈ విభాగంలో వైవిధ్యీకరణ పెరిగితే, బంగారంపై డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు మరో కీలక డ్రైవర్‌గా మారాయి. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వల్లో Gold వాటాను పెంచుకుంటూ పోతున్నాయి. డాలర్ ఆధిపత్యంపై అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో.. బంగారం ఒక వ్యూహాత్మక రిజర్వ్ ఆస్తిగా మారుతోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం, కేంద్ర బ్యాంకుల పోర్ట్‌ఫోలియోలలో బంగారం వాటా ఇంకా పెరిగే అవకాశముంది. పై అంశాలు అన్నీ కలిపి చూస్తే..బంగారం ధరలు చుక్కలు తాకడం ఖాయంగా తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications











