Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
2026 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 2 లక్షలు.. పసిడి ప్రియులను వణికిస్తున్న సరికొత్త నివేదిక..
దేశంలో పసిడి ధరలు ఆగనంటున్నాయి. సామాన్యుడు బంగారం పేరెత్తాలంటనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా బంగారం ధరల పెరుగుదలపై వచ్చిన అంచనాలు పసిడి ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్స్ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం.. 026 నాటికి బంగారం ధర రూ.2 లక్షల దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన సురక్షిత పెట్టుబడి డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల దూకుడు కొనుగోళ్లు, అలాగే ప్రైవేట్ పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వల్ల 2026 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 5,400 డాలర్లకు చేరవచ్చని ఈ వాల్ స్ట్రీట్ దిగ్గజం అంచనా వేసింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,800 నుంచి 4,900 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు బంగారం ధరలను పైకి తీసుకువెళుతున్న ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న ఈ ర్యాలీ ప్రభావం భారత మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. ముంబై మార్కెట్‌లో ప్రస్తుతం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల Gold ధర 10 గ్రాములకు సుమారు రూ.1,55,900 స్థాయిలో ఉంది. అంటే గ్రాముకు దాదాపు రూ.15,600. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారం మార్కెట్లలో భారతదేశం ఒకటిగా మారింది.

అంతర్జాతీయంగా చూస్తే.. ఔన్సుకు సుమారు 4,850 డాలర్ల ధర గ్రాముకు దాదాపు 156 డాలర్లుగా మారుతుంది. ప్రస్తుత మారకపు రేటుతో రూపాయల్లోకి మార్చితే, ఈ ధర భారత రిటైల్ మార్కెట్లో చెల్లిస్తున్న ధరల కంటే తక్కువగానే ఉంటుంది. ఈ తేడాకు ప్రధాన కారణం భారతదేశంలో Gold దిగుమతులపై విధించే కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, అలాగే తయారీ ఛార్జీలు అని చెప్పవచ్చు. భారతదేశం తన బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అందువల్ల దిగుమతి సుంకాలు ప్రపంచ ధరపై అదనపు భారాన్ని మోపుతాయి. రూపాయి డాలర్‌తో పోల్చితే బలహీనపడిన ప్రతిసారీ బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ఆభరణాల విషయంలో మేకింగ్ ఛార్జీలు కూడా వినియోగదారుల ఖర్చును గణనీయంగా పెంచుతున్నాయి.
బంగారం ధరల పెరుగదలపై మోదీ సర్కారు ఫోకస్.. బడ్జెట్ 2026లో పన్ను తగ్గింపు మీద పసిడి ప్రియుల ఆశలు..
గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర ఔన్సుకు 5,400 డాలర్లకు చేరితే.. అంతర్జాతీయంగా గ్రాముకు దాదాపు 174 డాలర్ల స్థాయి వస్తుంది. దీనికి దిగుమతి సుంకాలు, పన్నులు, స్థానిక ప్రీమియంలను జోడిస్తే, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.7 లక్షల నుంచి రూ.1.9 లక్షల మధ్యకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి మారకపు విలువలో మార్పులు లేదా ప్రభుత్వ పన్ను విధానాల్లో సవరణలు జరిగితే ఈ ధర ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.
ఈ ధరల పెరుగుదల భారతీయ కుటుంబాలకు ఇప్పటికే ఉన్న బంగారం నిల్వల విలువను పెంచినా.. కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి భారంగా మారవచ్చు. అలాగే, అధిక బంగారం ధరలు దేశ దిగుమతి బిల్లుపై, వాణిజ్య లోటుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది, ముఖ్యంగా పండుగలు, వివాహాల సీజన్లలో డిమాండ్ పెరిగితే మరీ కష్టతరమవుతుంది.
ఇక పెట్టుబడిదారుల పరంగా చూస్తే.. నిపుణులు బంగారాన్ని తాత్కాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక రక్షణ ఆస్తిగా చూడాలని సూచిస్తున్నారు. సావరిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వంటి ఎంపికలు భౌతిక బంగారంతో పోల్చితే సౌకర్యవంతమైనవిగా ఉన్నాయి. అయితే ధరలు ఇప్పటికే నింగిని తాకినందున.. దశలవారీగా పెట్టుబడి పెట్టడం ఉత్తమమైప మార్గంగా భావిస్తున్నారు.పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications
