Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
బంగారం ధరలు.. ఉందిలే మంచి కాలం!!
బంగారం ధరల్లో నేడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రికార్డు స్థాయి రేటుకు చేరుకున్న పసిడి.. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బంగారం కొనుగోలుదారుల్లో ఆశలను రేకెత్తిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆరంభమైన వీటి ధరల క్షీణత.. ఇక మున్ముందు కూడా కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అంతర్జాతీయ చోటు చేసుకుంటోన్న పరిణామాలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోన్నాయి.
శుక్రవారం కూడా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గుముఖం పట్టాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,400 కాగా, 22 క్యారెట్ల పసిడి రూ. 1,31,450గా నమోదైంది. మరోవైపు, స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,95,100 వద్ద కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు.. ఢిల్లీ, జైపూర్లో 22 క్యారెట్లు రూ. 1,31,600, 24 క్యారెట్లు రూ. 1,43,550గా నమోదైంది.

అహ్మదాబాద్లో 22 క్యారెట్లు రూ. 1,31,500, 24 క్యారెట్లు రూ. 1,43,450. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతాలలో 22 క్యారెట్లు రూ. 1,31,450, 24 క్యారెట్లు రూ. 1,43,400 నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. COMEXలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,599.2 డాలర్ల వద్ద స్వల్పంగా తగ్గింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 90.05 డాలర్లకు పడిపోయింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,433, 22 క్యారెట్లు - రూ. 13,230, 18 క్యారెట్లు - రూ. 11,050
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు - రూ. 10,755
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు- రూ. 10,755
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు- రూ. 10,755
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు- రూ. 10,755
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,340, 22 క్యారెట్లు- రూ. 13,145, 18 క్యారెట్లు- రూ. 10,755
Credit: Oneindia



Click it and Unblock the Notifications
