కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు తగ్గుదల చూస్తే ఎగిరి గంతేయాల్సిందే.. జనవరి 31, శనివారం ధరలు ఇవే..

By Borra Hazarathaiah

బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు నేడు కూడా అదే స్థాయిలో పతనమయ్యాయి. చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు అంతర్జాతీయంగా బంగారం, వెండి మార్కెట్లను కుదిపేశాయి. మార్కెట్లలో తీవ్ర స్థాయిలో లాభాల బుకింగ్ ప్రారంభం కావడంతో విలువైన లోహాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూశాయి.

అంతర్జాతీయ మార్కెట్లో COMEX GOld ధర ఒక్క రోజులోనే 11 శాతానికి పైగా క్షీణించి ఔన్సుకు సుమారు 4,763 డాలర్ల వద్ద ముగిసింది. ఇది ఇటీవల నమోదైన జీవితకాల గరిష్ట స్థాయి 5,625 డాలర్లతో పోలిస్తే దాదాపు 15 శాతం తక్కువ అని చెప్పవచ్చు. అదే విధంగా COMEX వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ప్రస్తుతం వెండి ధర దాని రికార్డు గరిష్ట స్థాయి 121.75/oz డాలర్లతో పోలిస్తే 31 శాతానికి పైగా తగ్గింది.


Gold price today gold rate India 24k gold price 22k gold rate 18k gold rate gold price drop gold rate today October 30 gold price fall India gold price per 10 grams gold price per 100 grams gold rate live update gold buying India gold market news 24 carat gold rate 22 carat gold price Indian gold market gold investment news gold rate change today gold rate gold jewellery price India 24 22 18 30 100
Photo Credit:

ఈ పతనానికి ప్రధాన కారణంగా CMEలో మార్జిన్ హైక్ చర్చలు మారాయి. ఇప్పటికే రాగిపై మార్జిన్‌ను 20 శాతానికి పెంచిన CME.. Gold, వెండిపైనా అదే దిశగా అడుగులు వేయవచ్చన్న ఊహాగానాలు మార్కెట్లో భయాన్ని పెంచాయి. ధరలు ఇప్పటికే ఓవర్‌బాట్ స్థాయిలో ఉండటంతో చిన్న నెగెటివ్ న్యూస్‌కే భారీ అమ్మకాలు వచ్చాయి. దీంతో పాటుగా US ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఎంపికపై స్పష్టత రావడం కూడా మార్కెట్ భావోద్వేగాలను మార్చింది. ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా కఠిన విధానాలే కొనసాగుతాయన్న అంచనాలతో అమెరికన్ డాలర్ బలపడింది. దీంతో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి.

వీటికి తోడు రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై కూడా బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉన్నారు. ఆభరణాల డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను తగ్గించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాంటి నిర్ణయం తీసుకుంటే.. దేశీయ మార్కెట్లో ధరలు మరింత దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈరోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి.

జనవరి 31, శనివారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.862 తగ్గి రూ.16,058 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.790 తగ్గి రూ.14,720 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.646 తగ్గి రూ.12,044 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,200 తగ్గి రూ.16,05,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 79,000 తగ్గి రూ. 14,72,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 64,600 తగ్గి రూ.12,04,400 వద్ద ట్రేడ్ అవుతోంది.

బంగారం, వెండి ధరలు ఢమాల్.. ప్రపంచ మార్కెట్లను కుదిపేసిన CME మార్జిన్ పెంపు.. దానికి తోడైన బడ్జెట్ 2026..

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.8,620 తగ్గి రూ.1,60,580 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 7,900 తగ్గి రూ.1,47,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.6,460 తగ్గి రూ.1,20,440 గా నమోదైంది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.8,620 తగ్గి రూ.1,60,580 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 7,900 తగ్గి రూ.1,47,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.6,460 తగ్గి రూ.1,20,440 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,62,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,49,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,28,000 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.8,620 తగ్గి రూ.1,60,580 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 7,900 తగ్గి రూ.1,47,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.6,460 తగ్గి రూ.1,20,440 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,60,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,47,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,20,590 గా నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,60,630 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,47,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,20,490 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు

విశాఖపట్నంలో.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.8,620 తగ్గి రూ.1,60,580 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 7,900 తగ్గి రూ.1,47,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.6,460 తగ్గి రూ.1,20,440 గా నమోదైంది.

కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.8,620 తగ్గి రూ.1,60,580 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 7,900 తగ్గి రూ.1,47,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.6,460 తగ్గి రూ.1,20,440 గా నమోదైంది.

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.8,620 తగ్గి రూ.1,60,580 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 7,900 తగ్గి రూ.1,47,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.6,460 తగ్గి రూ.1,20,440 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Credit: Goodreturns

Story first published: Saturday, January 31, 2026, 10:13 [IST]
Desktop Bottom Promotion