బంగారం ధరలు తగ్గాయని సంబరపడి కొనకండి.. ఈ కీలక ఫలితాలు వచ్చేదాకా ఆగాలంటున్న ఆర్థిక నిపుణులు

By Borra Hazarathaiah

ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రెండు నెలల క్రితం వరకు రికార్డు గరిష్టాలను తాకిన ఈ విలువైన లోహాలు, ఇప్పుడు వాటి గరిష్ట స్థాయి కంటే చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. దీనితో చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడే కొనాలా లేక ఇంకాస్త వేచి చూడాలా? అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు.

గత వారం బంగారం ధర రూ.1,30,624 నుండి రూ.1,22,043కి పడిపోయింది. అలాగే వెండి ధర కిలోకు దాదాపు రూ.21,000 తగ్గింది. MCX మార్కెట్లో కూడా Gold 10 గ్రాములకు రూ. 1,27,633 నుండి రూ. 1,21,077కు చేరింది. అలాగే వెండి ధర కిలోకు రూ. 1,63,050 నుండి రూ. 1,45,031కు పడిపోయింది.

యాక్సిస్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దేవయ్య గగ్లానీ ప్రకారం.. గత తొమ్మిది వారాల పాటు Gold ధరలు నిరంతరం పెరిగాయి. అయితే ట్రంప్-జిన్‌పింగ్ సమావేశానికి ముందు లాభాల బుకింగ్ జరగడంతో ధరలు 3 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు కూడా బంగారం, వెండి ధరలపై ఒత్తిడి తెచ్చాయి.


gold price today silver price today gold and silver news gold price fall silver price fall should you buy gold now gold investment tips silver investment advice gold market analysis gold rate in India silver rate in India expert opinion on gold gold vs silver precious metals outlook gold buying guide 2025 bullion market news gold price forecast silver price forecast

గగ్లానీ అభిప్రాయం ప్రకారం, దేశీయ మార్కెట్లో బంగారానికి రూ. 1,17,000 వద్ద బలమైన మద్దతు ఉంది. అంటే ఈ స్థాయిలే ధర ఉన్నప్పుడు మీరు కొనుగోలు చేస్తే లాభాలు పొందే అవకాశం ఉంది. ఇక రూ. 1,24,000 వద్ద నిరోధం ఉంది. అంటే ఆ రేటు వద్ద బంగారం కొనుగోళ్లు ఆపేయాలని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెద్దగా మారే అవకాశం తక్కువగా ఉన్నందున కొనుగోలులో తొందరపడకూడదని పెట్టుబడిదారులకు సూచించారు

బంగారం ధరలు భారీగా పతనం.. వెయిట్ చేయండి ఇంకా తగ్గుతాయి.. అక్టోబర్ 28, మంగళవారం ధరలు ఇవే..

ఇక ఆస్పెక్ట్ బులియన్ & రిఫైనరీ CEO దర్శన్ దేశాయ్ ప్రకారం.. అమెరికా-చైనా ఒప్పందం, బలమైన అమెరికా డాలర్ కారణంగా సురక్షిత పెట్టుబడుల డిమాండ్ తగ్గింది. అదే బంగారం-వెండి ధరల పతనానికి కారణమని ఆయన తెలిపారు. ఇక, రాబోయే రోజులు బులియన్ మార్కెట్‌కు కీలకమని దేశాయ్ చెబుతున్నారు. ఎందుకంటే ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం, పెద్ద ఐటి కంపెనీల ఆదాయ నివేదికలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.

మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి ప్రకారం.. ప్రపంచ పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం-వెండి నుండి స్టాక్స్ వైపుకి మారుతున్నారు. బలమైన డాలర్ వల్ల విదేశీ కొనుగోలుదారులకు లోహాలు ఖరీదైనవిగా మారి, డిమాండ్ తగ్గుతోంది. అతని అంచనా ప్రకారం డాలర్ మరింత బలపడితే, బంగారం-వెండి ధరలు ఇంకా పెరుగుదలను ఎదుర్కోవలసి వస్తుంది.

ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ అభిప్రాయం ప్రకారం.. ఈ తగ్గుదల మార్కెట్‌లో ఆరోగ్యకరమైన సవరణ (healthy correction) మాత్రమే. గత రెండు నెలల్లో మొదటిసారిగా రెండు లోహాలు వారాంత నష్టాన్ని చూపాయి. ETF ఉపసంహరణలు, లాభాల బుకింగ్, వాణిజ్య ఉద్రిక్తతల తగ్గుదల ఇవే ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. అయితే కాంబోజ్ హెచ్చరిక ఏమిటంటే.. కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు ట్రంప్-జిన్‌పింగ్ సమావేశ ఫలితాన్ని గమనించడం అత్యవసరం. రాబోయే వారం బంగారం-వెండి మార్కెట్‌కు దిశ నిర్ధేశకమవుతుందని తెలిపారు.

క్లుప్తంగా చెప్పాలంటే.. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గినా ఇప్పుడే భారీగా కొనుగోలు చేయడం కన్నా వేచి చూడటం మంచిదని నిపుణులందరూ సూచిస్తున్నారు. అమెరికా-చైనా చర్చలు, డాలర్ బలహీనత లేదా ఫెడ్ నిర్ణయాలు బంగారం దిశను నిర్ణయిస్తాయి కాబట్టి వాటి ఫలితాల కోసం వేచి చూడాలని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

Credit: Goodreturns

Desktop Bottom Promotion