Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
బంగారం, వెండి ధరలు ఢమాల్.. ప్రపంచ మార్కెట్లను కుదిపేసిన CME మార్జిన్ పెంపు.. దానికి తోడైన బడ్జెట్ 2026..
గత కొద్ది రోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బంగారం-వెండి ధరలకు భారీ షాక్ తగిలింది. సామాన్యులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే..చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు ప్రపంచ కమోడిటీ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేశాయి. ఈ పరిణామంతో శుక్రవారం బంగారం, వెండి మార్కెట్లలో తీవ్ర స్థాయిలో లాభాల బుకింగ్ ప్రారంభమైంది. దీని ఫలితంగా ఈ విలువైన లోహాల ధరలు భారీగా పడిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో COMEX బంగారం ధర ఒక్కరోజులోనే 11 శాతానికి పైగా క్షీణించి ఔన్సుకు సుమారు 4,763 డాలర్ల వద్ద ముగిసింది. ఇది ఇటీవల నమోదైన జీవితకాల గరిష్ట స్థాయి 5,625 డాలర్లతో పోలిస్తే దాదాపు 15 శాతం తక్కువ అని చెప్పవచ్చు. అదే విధంగా COMEX వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ప్రస్తుతం వెండి ధర దాని రికార్డు గరిష్ట స్థాయి 121.75/oz డాలర్లతో పోలిస్తే 31 శాతానికి పైగా తగ్గింది.

భారత మార్కెట్లో కూడా ఈ అంతర్జాతీయ ప్రభావం స్పష్టంగా కనిపించింది. MCXలో ఏప్రిల్ ఫ్యూచర్స్ Gold ధర 10 గ్రాములకు రూ. 1,50,849 వద్ద ముగిసింది. ఇది ఒక్కరోజులోనే దాదాపు రూ. 1,500 నష్టం అని చెప్పవచ్చు. గరిష్ట స్థాయి రూ. 1,80,779తో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర సుమారు 16.5 శాతం దిగువన ఉంది.ఇక మార్చి ఫ్యూచర్స్ వెండి ధర కిలోకు రూ. 2,91,922 వద్ద ముగిసింది. ఇది దాని ఆల్‌టైమ్ హై రూ. 4,20,048 తో పోలిస్తే దాదాపు 30 శాతం కంటే ఎక్కువ తగ్గుదలను సూచిస్తోంది.
ధరలు ఎందుకు ఒక్కసారిగా పడిపోయాయి: ఈ పతనానికి ప్రధాన కారణంగా CMEలో మార్జిన్ హైక్ చర్చలు మారాయి. ఇప్పటికే రాగిపై మార్జిన్‌ను 20 శాతానికి పెంచిన CME.. Gold, వెండిపైనా అదే దిశగా అడుగులు వేయవచ్చన్న ఊహాగానాలు మార్కెట్లో భయాన్ని పెంచాయి. ధరలు ఇప్పటికే ఓవర్‌బాట్ స్థాయిలో ఉండటంతో చిన్న నెగెటివ్ న్యూస్‌కే భారీ అమ్మకాలు వచ్చాయి.
ఇదే సమయంలో, US ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఎంపికపై స్పష్టత రావడం కూడా మార్కెట్ భావోద్వేగాలను మార్చింది. ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా కఠిన విధానాలే కొనసాగుతాయన్న అంచనాలతో అమెరికన్ డాలర్ బలపడింది. బలమైన డాలర్ సాధారణంగా బంగారం, వెండి ధరలకు ప్రతికూలంగా పనిచేస్తుంది. దీంతో బంగారం, వెండి ధరలు ఒత్తిడిని ఎదుర్కున్నాయి.
బంగారం ధరల పెరుగుదలపై అంతర్జాతీయ బ్యాంక్ JPMorgan కీలక హెచ్చరిక.. పసిడి ర్యాలీపై షాకింగ్ న్యూస్..
మరో ప్రమాద కారకంగా బడ్జెట్ 2026: వీటికి తోడు రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై కూడా బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉన్నారు. ఆభరణాల డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను తగ్గించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాంటి నిర్ణయం తీసుకుంటే.. దేశీయ మార్కెట్లో ధరలు మరింత దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సురక్షిత పెట్టుబడుల ఆకర్షణ తగ్గుతోందా: గత కొన్ని వారాలుగా బంగారం, వెండికి మద్దతుగా నిలిచిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంతవరకు సడలించడం కూడా ధరలపై ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల సేఫ్ హెవెన్ డిమాండ్ తగ్గింది. పెట్టుబడిదారులు ఈ ఆస్తుల నుండి బయటకు వస్తున్నారు.
నిపుణుల అంచనా ప్రకారం సమీప కాలంలో COMEX బంగారం ధర 4,550 డాలర్ల నుంచి 4,900 డాలర్ల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక MCX బంగారం ధర విషయానికి వస్తే రూ. 1,35,000 నుండి రూ. 1,80,000 (10 గ్రాములు) మధ్యన నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే వెండి ధరలు చూసుకున్నట్లయితే.. COMEX వెండి ధర 70 డాలర్ల నుంచి 95 డాలర్ల మధ్యన ఉండే అవకాశం ఉంది. MCX చూసుకుంటే వెండి రూ. 2,50,000 నుంచి రూ. 3,50,000 (కిలో) మధ్యలో ఉండే అవకాశం ఉంది. అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు మాత్రమే వెండిలో స్వల్ప ట్రేడింగ్‌కు ప్రయత్నించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఏదేమైనా CME మార్జిన్ హైక్ బజ్, బలమైన డాలర్, బడ్జెట్ 2026 అంచనాలు కలిసి బంగారం-వెండి మార్కెట్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి. తాత్కాలికంగా అస్థిరత కొనసాగినా, దీర్ఘకాల పెట్టుబడిదారులు మాత్రం జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications











