బంగారం ధరలు.. తలకిందులు

By Chandrasekhar Rao

గత వారం బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అయిదు ట్రేడింగ్ రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మాత్రం స్వల్పంగా పెరిగాయి. మరోవైపు- వెండి ధరలు ఈ రెండు ట్రేడింగ్ మార్కెట్లలోనూ గణనీయమైన మార్పులను చవిచూశాయి. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం గత అయిదు ట్రేడింగ్ రోజుల్లో బంగారం ధరలు తగ్గాయి.

నేడు- బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,270గా నమోదైంది. 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 1,23,090 పలుకుతోంది. ఇక స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి రూ. 2,13,900కు లభిస్తోంది. ఇది రికార్డు. ఇప్పటివరకు ఈ స్థాయిలో వెండి రేటు ఎప్పుడూ నమోదు కాలేదు.


Gold Soars to Fresh Record on Expectations of Rate Cuts and Robust Safe-Haven Demand

ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఢిల్లీ, జైపూర్‌లో 22 క్యారెట్లు రూ. 1,23,240 కాగా 24 క్యారెట్లు రూ. 1,34,420. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,23,140, 24 క్యారెట్లు రూ. 1,34,320 చొప్పున నమోదయ్యాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,23,090, 24 క్యారెట్ల బంగారం ₹1,34,270 వద్ద కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,615, 22 క్యారెట్లు - రూ. 12,480, 18 క్యారెట్లు - రూ. 10,420

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు - రూ. 10,146

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు- రూ. 10,146

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు- రూ. 10,146

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు- రూ. 10,146

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు- రూ. 10,146

Credit: Oneindia

Story first published: Monday, December 22, 2025, 10:11 [IST]
Desktop Bottom Promotion