బంగారం ధరల పెరుగుదలపై మరో బాంబు పేల్చిన కియోసాకి.. రూ.10 గ్రాములు ధర రూ.8.68 లక్షలకు..

By Borra Hazarathaiah

అంతర్జాతీయ బంగారం మార్కెట్‌లో జనవరి 26న పసిడి ధరలు భగ్గుమన్నాయి. తొలిసారిగా స్పాట్ బంగారం ధర ఔన్సుకు 5 వేల డాలర్ల మైలురాయిని దాటింది. ఇది బంగారం ధరల చరిత్రలో ఒక కీలక మలుపుగా ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ స్థాయిలో చూసినట్లయితే.. భారతీయ మార్కెట్లో 10 గ్రాముల Gold ధర రూ.1.60 లక్షలకుపైగా చేరినట్టేనని చెప్పవచ్చు. ఈ భారీ పెరుగుదలతో పెట్టుబడిదారులు మాత్రమే కాదు.. ఆర్థిక నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం భవిష్యత్తుపై తన బలమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. బంగారం ర్యాలీ ఇంకా ముగియలేదని.. రాబోయే సంవత్సరాల్లో బంగారం ధర ఔన్సుకు 27 వేల డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇది భారతీయ రూపాయల్లో లెక్కిస్తే.. 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.8.68 లక్షలకు చేరే స్థాయి అని చెప్పవచ్చు.

సోషల్ మీడియా వేదిక X (మునుపటి ట్విట్టర్)లో కియోసాకి స్పందిస్తూ.. Gold ధర 5 వేల డాలర్లు దాటడం తన గత అంచనాలను నిజం చేస్తోందని తెలిపారు. తాను చాలా కాలంగా చెబుతున్నట్లుగా, ఫియట్ కరెన్సీలు, ముఖ్యంగా US డాలర్, క్రమంగా తమ కొనుగోలు శక్తిని కోల్పోతున్నాయని మరోసారి స్పష్టం చేశారు. అమెరికాకు పెరుగుతున్న అప్పు కారణంగా డాలర్ విలువ బలహీనపడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ ఆస్తులు పెట్టుబడిదారులకు రక్షణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయ పడుతున్నారు.


gold price prediction gold will hit 27000 gold price forecast robert kiyosaki gold prediction gold at 5000 dollars why gold will rise gold super cycle gold price rally gold investment news gold market outlook safe haven gold dollar collapse gold inflation hedge gold precious metals rally gold bull run gold price analysis gold future price global gold demand central bank gold buying 27000 5000

తన తాజా పోస్ట్‌లో.. బంగారం ధర 27 వేల డాలర్లకి ఎప్పుడు చేరుతుందో ఖచ్చితమైన గడువు చెప్పకపోయినా.. ప్రస్తుత ధరల వద్ద కూడా తాను బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేస్తూనే ఉంటానని కియోసాకి తెలిపారు. ధరలు పెరుగుతున్నాయా లేదా పడిపోతున్నాయా అనే అంశం తనకు ముఖ్యం కాదని, అసలు సమస్య అమెరికా అప్పు వేగంగా పెరుగుతుండటమేన కారణమని ఆయన అన్నారు. అప్పు పెరిగే కొద్దీ డాలర్ విలువ తగ్గుతుందని, అదే సమయంలో బంగారం, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు బలంగా నిలబడతాయని ఆయన విశ్లేషించారు.

రూ. 24 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. లబోదిబోమంటున్న పసిడి ప్రియులు.. జనవరి 26, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల తాజా ర్యాలీకి వెనుక అనేక ప్రపంచ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు, వాణిజ్య సంఘర్షణలు పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి. ఈ సురక్షిత పెట్టుబడుల్లో బంగారం మొదటి స్థానంలో ఉంది. అలాగే, US డాలర్ బలహీనత కూడా బంగారాన్ని ఇతర దేశాల పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.

ఇటీవలి కాలంలో అమెరికా మార్కెట్లపై పెట్టుబడిదారుల నమ్మకం కొంత తగ్గింది. విధాన నిర్ణయాలపై అనిశ్చితి, వాణిజ్య విధానాల్లో మార్పులు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోప్‌పై సుంకాల విషయంలో వెనక్కి తగ్గినా, కెనడా, ఫ్రాన్స్‌పై భారీ సుంకాలు విధించే హెచ్చరికలు చేయడం ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలను పెంచింది. ఇవన్నీ బంగారం వంటి సురక్షిత ఆస్తులకు మద్దతుగా మారాయి.

గత ఏడాది ప్రారంభమైన బలమైన ర్యాలీకి కొనసాగింపుగానే ప్రస్తుత బంగారం పెరుగుదల కనిపిస్తోంది. 2025లో బంగారం ధరలు సుమారు 70 శాతం పెరిగాయి. ఇది 1979 తర్వాత అత్యుత్తమ వార్షిక ప్రదర్శనగా నిలిచింది. ప్రస్తుత నెలలోనే బంగారం దాదాపు 17 శాతం పెరగడం ఈ బలమైన ట్రెండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, గోల్డ్ ETFలలో పెరుగుతున్న పెట్టుబడులు ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Credit: Goodreturns

Story first published: Tuesday, January 27, 2026, 8:07 [IST]
Desktop Bottom Promotion