Latest Updates
-
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే!
రూ.11999 ధరకే 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Realme Narzo 90x 5G Smartphone Sale : రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్‌లో గత వారంలో నార్జో 90 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. రియల్‌మి నార్జో 90x 5G, నార్జో 90 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. దీంతోపాటు 50MP కెమెరాను కలిగి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది.
రూ.2000 డిస్కౌంట్ ఆఫర్ :
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499 గా ఉంది. ఈ ఫోన్‌ను రియల్‌మి ఇండియా, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి వెబ్‌సైట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

రూ.11999 ధరకే :
అదే అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2000 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ.11999, రూ.13499 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లాష్ బ్లూ, నిట్రో బ్లూ కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉంటుంది.
డిస్‌ప్లే, చిప్‌సెట్ వివరాలు :
రియల్‌మి నార్జో 90x 5G స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది.

భారీ బ్యాటరీ, 50MP కెమెరా :
ఈ ఫోన్ 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.
ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా WiFi, బ్లూటూత్ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. నార్జో 90x 5G ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుండగా.. మరో ఫోన్ నార్జో 90 5G స్మార్ట్‌ఫోన్ సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.16999 గా ఉంది.
రియల్‌మి నార్జో 90 5G ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.57 అంగుళాల అమోలెడ్ ఫుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. 60W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సర్, 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
Credit: Gizbot



Click it and Unblock the Notifications
