Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
బంగారం పెరుగుదలపై నిజమవుతున్న బ్రహ్మంగారి అంచనాలు.. మహిళలు పసిడి మంగళసూత్రాలకు బదులుగా..
భవిష్యత్తులో జరిగే పరిణామాలను శతాబ్దాల ముందే ఊహించిన మహానుభావులలో బ్రహ్మంగారు ఒకరు అని చాలామంది ఇప్పటికీ విశ్వసిస్తాుంటారు. కాలం, విధి, సమాజ మార్పులపై ఆయన చేసిన ప్రవచనాలు నేటి రోజుల్లో నిజమవుతున్నాయని అనేక ఉదాహరణలు భక్తులతో పాటుగా పరిశోధకులు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న బ్రహ్మంగారి అంచనాలలో ఒకటి.. మహిళల మంగళసూత్రాలు, బంగారం వినియోగానికి సంబంధించిన ప్రవచనం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. భవిష్యత్తులో మహిళలు బంగారు మంగళసూత్రాల స్థానంలో చెక్క గాజులు లేదా తక్కువ విలువైన వస్తువులు ధరించే పరిస్థితి వస్తుందని బ్రహ్మంగారు ముందే చెప్పారని నమ్మకం ఉంది. నేటి పరిస్థితులను చూస్తే ఈ మాటలు క్రమంగా నిజమవుతున్నాయేమో అన్న భావన ప్రజల్లో కలుగుతోంది. దీనికి కారణం బంగారం ధరలు సాధారణ ప్రజలకు అందని స్థాయికి చేరుకుంటుండటమేనని చెప్పవచ్చు.

గత ఒక సంవత్సరం కాలంగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు భద్రతా పెట్టుబడిగా భావించిన బంగారం, ఇప్పుడు సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది. పెట్టుబడిగా మాత్రమే కాకుండా..Gold ఆభరణాల కొనుగోలు కూడా చాలా మందికి కలగా మారింది. ముఖ్యంగా జనవరి 21న ఒక్కరోజులోనే బంగారం ధరలు రూ.800కి పైగా పెరగడం మార్కెట్లను, వినియోగదారులను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది.
ఈ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల అభిరుచుల మార్పు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూడడం పెరగడంతో.. స్థానిక మార్కెట్లలో ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీని ఫలితంగా, ఒక సాధారణ బంగారు గొలుసు కొనాలన్నా ఇప్పుడు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రూ. లక్షకి రూ.3.64 లక్షలు..సావెరిన్ గోల్డ్ బాండ్స్ మీద RBI కీలక ప్రకటన..కొన్నవారికి పండేగ పండగ..
హిందూ సంప్రదాయాల ప్రకారం.. వివాహ సమయంలో Gold మంగళసూత్రం లేదా గొలుసు ధరించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, వివాహంలో బంగారం తప్పనిసరి అన్న భావన చాలా కాలంగా సమాజంలో ఉంది. కానీ నేటి పరిస్థితుల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అనేక కుటుంబాలకు పెద్ద సవాలుగా మారుతోంది. అప్పులు చేసి అయినా బంగారం కొనాలా? లేక సంప్రదాయాల్లో మార్పులు చేసుకోవాలా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నిపుణుల అంచనాల ప్రకారం.. రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే బ్రహ్మంగారు చెప్పినట్లుగా.. ప్రజలు బంగారానికి బదులుగా చెక్క, వెండి లేదా ఇతర సరసమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ప్రారంభించినా ఆశ్చర్యం లేదు.
ప్రస్తుతం బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,57,260 దాటగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,40,000కు పైగా చేరింది. ఒక్కరోజులో ఇంత భారీ పెరుగుదల చాలా అరుదైన విషయం. వెండి ధరలు కూడా అదే బాటలో వేగంగా పెరుగుతున్నాయి. ఏదేమైనా శతాబ్దాల క్రితం ఋషులు చేసిన అంచనాలు నేటి ఆర్థిక వాస్తవాలతో అనూహ్యంగా సరిపోతున్నాయనే భావన ప్రజల్లో బలపడుతోంది. బంగారం విలువ పెరుగుతున్న కొద్దీ, సంప్రదాయాలు కూడా కాలానుగుణంగా మారతాయా అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications











