Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
ఆహారం తక్కువే!...అట్టహాసం ఎక్కువ!!

బేబీకి మెత్తగా ఉడికించిన అన్నం లేదా బార్లీ అన్నం తల్లిపాలతో కలిపి ఇవ్వాలి. బేబీలకిచ్చే ఆహారంలో అన్ని పోషకాలతో పాటు ఐరన్ అధికంగా వుండాలి. బేబీ ఘనఆహారానికి అలవాటు పడాలంటే కొంత సమయం తీసుకుంటుంది. కనుక వెంటనే అధిక ఆహారాన్నివ్వకండి. ఆకలిని గ్రహించి ఆహారం ఎంత పరిమాణంలో ఇవ్వాలనేది నిర్ణయించండి. ఆహారంలో పండ్లు, కాయగూరలు, పప్పులు క్రమేణా చేర్చాలి. ఉడికించిన ఆహారాలు తేలికగా జీర్ణమవుతాయి.
పిల్లలకు వెజిటబుల్ సూప్ పోషకాహారంగా బాగుంటుంది. పండ్లు వంటివి విత్తనాలు, తొక్కలు తీసివేసి తినిపించాలి. ఒక సంవత్సరంలోపు పిల్లలకు ఆవు పాలు పట్టకండి. అవి అజీర్ణం చేస్తాయి. బేబీకి మంచి పోషకాహారం తినిపించాలంటే ఈ సూచనలు పాటించండి. బేబీలు తినేది తక్కువే అయినా వారు తినే ఆహారం పట్ల అధిక జాగ్రత్తలు వహించాలి. బేబీ ఫుడ్లు ఎంతా బాగా చేసినా అతిగా తినిపించకుండా కూడా వుంటే బేబీ యాక్టివ్ గా వుంటుందన్నది మరువకండి.



Click it and Unblock the Notifications
