Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
బేబీ మెదడు ఎలా అభివృధ్ధి చెందుతుంది?

ప్రపంచంలోనే ఒక అత్యంత సహజమైన ప్రక్రియ ఇది. ఒక జీవిలో బ్రెయిన్ చర్యలు ప్రధానమైనవి. ఇవి వాసన, ఆలోచనలు, ఇంద్రియాలను నియంత్రిస్తాయి. బ్రెయిన్ నియంత్రించకపోతే, మనం
ఏదో ఒకదానికే అతుక్కొనిపోతాం.
గర్భవతులలోని బేబీల బ్రెయిన్ యాక్టివిటీని రేడియోగ్రాఫ్ ద్వారా చూడవచ్చు. అయితే వీరి చర్యలు నొప్పి వంటివాటికే స్పందిస్తాయి. ఇది బేబీ బ్రెయిన్ అభివృధ్ధిలో సాధారణం. బేబీ
పుట్టినప్పటి బరువులో బ్రెయిన్ బరువు పదో వంతు వుంటుంది. బేబీ ఎదిగే కొద్దీ అది పరిమాణం పెరుగుతుంది. మానసికంగా కూడా ఎదుగుతుంది. బేబీ రెండు నెలలు వచ్చేసరికి పెద్దవారితో
స్పందించగలదు. మూడు నెలలు వచ్చేసరికి ఈ చర్య మరింత మెరుగవుతుంది. తల్లి నవ్వితే తానూ నవ్వే దశకు వస్తుంది.
అయిదు నెలలు వచ్చే సరికి ధ్వనులు చేయటం మొదలుపెడుతుంది. బేబీ సహజ భాష 18 నెలలకు మొదలవుతుంది. 7 లేదా 8 నెలలు వచ్చేసరికి బేబీ గతంలో తాను చూడని వారితో
కూడా స్పందించటం మొదలుపెడుతుంది. సిగ్గు, ఆనందం, గుర్తు పట్టటం చేస్తుంది. బేబీ మొదటి సంవత్సరంలోనే భావాలను నియంత్రించే బ్రెయిన్ భాగాలు పెరుగుతాయి. వారి భావాలను
మెరుగుపరచాలంటే, మీరు సహనంగా వుంటూ, వారి చేష్టలను అర్ధం చేసుకోవాలి. పిల్లల బ్రెయిన్ మరింత వికసించాలంటే, ఆటలు ఆడటం, మంచి సంగీతం, పాటలు వంటివి వినిపించడం
ప్రధానం.



Click it and Unblock the Notifications
