Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
మీ బిడ్డకు వినికిడి ఎప్పటినుండి...?

అసలు బేబీ ఎప్పటినుండి వినగలదు?
పిండం అభివృధ్ధి చెందటమనేది ఒక ఆసక్తికర విషయం. దీనిని వ్యతిరేకించేవారు ఉండరు. కొంతమంది నిపుణుల మేరకు కడుపులో వున్న బిడ్డ తన 16వ వారంనుండే వినటం మొదలుపెడుతుంది. మరికొంతమంది 18 వ వారం లేదా 20వ వారం నుండి కూడా అని చెపుతారు. ఏది ఏమైనప్పటికి బేబీ రెండవ త్రైమాసిక గర్భిణీ స్ధితినుండి బయటి శబ్దాలు వింటుందనేది ఒక వాస్తవం.
బేబీ ఏం వినగలదు?
వాస్తవం చెప్పాలంటే, బేబీ మీ చుట్టుపట్ల ఏ శబ్దాలు వచ్చినా వినగలదు. అయితే చాలా పొరలతో కప్పబడి మీ కడుపులో వుండటం చేత, చుట్టూ వున్న ఉమ్మనీరు కారణంగా ఆ శబ్దాలు ఎక్కడో దూరంనుండి వినపడుతున్నట్లు అనిపిస్తాయి. కనుక కడుపుతున్న మీ మహిళ వద్ద తగవులు, కొట్లాటలు, హేళనలు వంటివి చేయకండి. కడుపులో వుండే బేబీ తాను వినే శబ్దాలు, పరిచయమా? కాదా? మంచివా? కఠినమైనవా? లేదా చికాకు శబ్దాలా అనేది కూడా గ్రహిస్తుంది. మీ మాటలను అర్ధం చేసుకోలేదు కాని వాటి భావనలు పట్టుకోగలదు.బిడ్డ నేర్చుకొనే భాష తల్లి కడుపునుండి దానికి మొదలవుతుంది. అందుకనే దానిని మాతృభాష అని అంటాము. ఆ భాషను కడుపులో పెరుగుతున్నప్పటినుండి నేర్చుకుంటుంది.
బేబీ ఏం వినేందుకు ఇష్టపడుతుంది?
హాయిగా వుండే ధ్వనులు...అంటే జోలపాటలవంటివి ఇష్టపడుతుంది. తరచుగా విని నిద్రించేందుకు ప్రయత్నిస్తుంది. రాక్ మ్యూజిక్ వంటివి పెద్ద ధ్వనులను వినిపించకండి. తట్టుకోలేదు. చిన్ని ధ్వని వచ్చే వాటిని బేబీకి వినిపించండి. అకస్మాత్ పెద్ద ధ్వనులు, ట్రాఫిక్ శబ్దాలు, హారన్ లు, మొదలైనవి బేబీని కలవరపరుస్తాయి. కనుక అరవటం, లేదా హింసాత్మక సినిమాలు చూడటం గర్భిణీ స్త్రీచేయరాదు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ లో మీరు వాస్తవంగా మీ బేబీ ధ్వనులకు ఎలా స్పందిస్తుందనేది తెలుసుకోవచ్చు.
బేబీ తన తల్లి గొంతు వినటానికి ఇష్టపడుతుంది. తల్లి, తండ్రి, కుటుంబంలోని ఇతర సభ్యుల గొంతులను రెండవ త్రైమాసికంలోనే తేలికగా గుర్తుపడుతుంది. కనుక మీ బేబీ మంచి విషయాలు విని ఆనందించేందుకు సహకరించండి.



Click it and Unblock the Notifications
