Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
శిశువుల చర్మ సంరక్షణ ఎలా?

ప్రత్యేకించి పిల్లలకొరకు కొంతమంది తయారీదార్లు వారికవసరమైన నూనెలు, సబ్బులు, పౌడర్లు, సువాసనా వస్తువులు తయారు చేస్తూంటారు. వీటి వాడకం పిల్లలకు ఆరోగ్యాన్నిస్తుంది. అయితే, వాటిని కొనేటపుడు నాణ్యత తప్పక పరిశీలించాలి. మీకు ఏ మాత్రం నాణ్యత తక్కువనిపించినా వాటిని పిల్లలకు వాడకండి. పిల్లలకు స్నానం చేయించే ముందు, ఆలివ్ లేదా బలవర్ధకమైన ఇతర నూనెలు రాసి సుతిమెత్తగా మర్దన చేయాలి. నూనెలోని ఔషధ గుణాలు చర్మానికి బాగా ఇంకి బిడ్డ శరీర చర్మం పొడిబారకుండా వుంటుంది. చర్మం ఆరోగ్యంగా వుంటే, పిల్లలకు చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా వుంటాయి.
చక్కని మసాజ్ లభిస్తే బిడ్డ కూడా బాగా విశ్రాంతి పొంది, ఏడవకుండా ఆడుకుంటుంది. అంతేకాదు మసాజ్ సమయంలో మీ చేతి స్పర్శ బిడ్డకు ఎంతో ఆనందాన్నిస్తుంది, తల్లితో ఒక చక్కటి అనుబంధం ఏర్పడేలా చేస్తుంది. బిడ్డ మీ చేతి స్పర్శకు భధ్రత, నమ్మకం, మీపట్ల ప్రేమ కలిగి వుంటుంది. బిడ్డతో శారీరకంగాను, మానసికంగాను స్పందించటం మీకు ఎంతో అవసరం. మసాజ్ చేస్తే దానివలన బిడ్డకుగల పేగు సంబంధిత, జీర్ణక్రియ సంబంధిత, నిద్ర సంబంధిత సమస్యలు తొలగి బిడ్డ ఎదుగుదల అభివృద్ధిత్వరితంగా కూడా వుంటుంది.



Click it and Unblock the Notifications