Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
పిల్లలకు పాలవలన కలిగే ఎలర్జీలు!

పిల్లలకు పాలు ఎలర్జీ కలగటం సాధారణంగా వచ్చే సమస్య. ఎలర్జీ వస్తే బిడ్డ చికాకుగా ఏడుస్తుంది. అలసట భావిస్తుంది. పొట్ట గడబిడ అవుతుంది, చర్మంపై ర్యాషెస్ రావటం, వాంతులు, డయోరియా వంటి చిహ్నాలు కనపడతాయి. బిడ్డ బరువు తక్కువ వుండటం, శ్వాస సంబంధిత సమస్యలు, గ్యాస్ ఏర్పడటం, డీహైడ్రేషన్, ఆకలి లేకపోవటం, ముక్కు లేదా గొంతులో మ్యూకస్ ఏర్పడటం, మొదలైన లక్షణాలు బేబీలో కనపడతాయి.
తల్లి ఈ లక్షణాలను బిడ్డలో వెంటనే కనిపెట్ట గలగాలి. మొదటి లక్షణంగా బిడ్డకు చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. సాధారణంగా దీనికి కారణం పాలలో వుండే ప్రొటీన్లు బిడ్డలోని యాంటీ బాడీస్ కు స్పందిస్తాయి. తల్లి పాలు ఇచ్చే తల్లులు ఆవు పాలు తాగటం వలన కూడా పిల్లలలో ఈ సమస్య ఏర్పడుతుంది.ఈ సమస్యను పరిష్కరించాలంటే, తల్లి ఆవుపాలు, దాని ఉత్పత్తులు తాగుతున్నా, తింటున్నా వెంటనే మానేయాలి.
అయితే, తక్షణమే వైద్యుడిని సంప్రదించి పిల్లాడికి తగినంత కాల్షియం, ఇతర పోషకాలు అందేందుకు అవసరమైన ఆహారాలు తీసుకోవాలి. ప్రొటీన్లు వుండే ఆహారాలు ఇవ్వాలంటే సోయా ప్రొటీన్ లేదా ఎమినో యాసిడ్లు కల బేబీ ప్రొటీన్ ఫార్ములా ఆచరించాలి. ఈ ఫార్ములాలో ప్రొటీన్ తేలికైన రూపంలో లభిస్తుంది.



Click it and Unblock the Notifications