పసిపిల్లల్ల మలబద్దకం నివారణా చిట్కాలు

By Super

పసిపిల్లలలో సాధారణ విషయాలు కూడా ఆందోళన కలిగించవచ్చు.కొన్ని సార్లు మీ పిల్లలు చాలా భాదగా ఉందని బాత్రూమ్ కి కూడా వెళ్ళటం మానివేస్తారు. ఖాళీ టాయిలెట్లు తల్లిదండ్రుల ఆందోళనకు కారణం కావచ్చు. అయితే పసిపిల్లల్లో మలబద్ధకం అనేది సాధారణ విషయం మరియు ఒక తీవ్రమైన వ్యాధి కాదు. ఇది సరికాని ఆహారం మరియు ప్రేగు కదలికల వలన కలుగుతుంది. మీ పిల్లలు బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు మీరు తరచుగా పరిశీలించి మలబద్దకం ఉంటే గుర్తించండి.

కేవలం మీ పిల్లలను పరిశీలించడం ద్వారా మలబద్దకంను మీరు సులభంగా కనుగొనవచ్చు. పసిపిల్లల్లో ప్రేగు కదలికలు క్రమం తప్పకుండా ఉండాలి. పిల్లలలో సగటున కనీసం ప్రతి రోజు ఒకసారి ప్రేగు కదలికలు కలిగి ఉండాలి. పసిపిల్లల్లో ప్రేగు కదలికలు వారంలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. సాధారణంగా మలబద్దకం ఉన్న పసిపిల్లలలో మలం విసర్జించడం చాలా కష్టంగా ఉంటుంది. మలబద్ధకంతో పాటు వికారం,కడుపు నొప్పి,పొట్ట ఉబ్బరం,ఆకలి లేకపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి. పసిపిల్లలకు మలబద్ధకం కలిగించే ఆహారంను ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. హెవీ మరియు ప్రాసెస్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వలన కొంతవరకు సమస్యను పరిష్కరించవచ్చు. ఇక్కడ పసిపిల్లల్లో ప్రేగు కదలికలను నియంత్రించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

Constipation in toddlers: Ways to treat it

1. ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారం పసిపిల్లల్లో మలబద్ధకం నివారించేందుకు అవసరమైన విషయం అని చెప్పవచ్చు. మీ పిల్లలకు ఫైబర్ సమృద్దిగా ఉన్న ఆహారాన్ని ఇవ్వండి. పిల్లలకు ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారం ఇవ్వటం కూడా ముఖ్యం. ఆహారంలో పండ్లు మరియు వేజ్జిస్ ఒక మంచి ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తాయి. భోజనం వదలకుండా తినటానికి ఆకర్షణీయంగా అలంకరణ చేయాలి. పిల్లలకు ఫైబర్ పెట్టె విషయంలో అధిక దృష్టి పెట్టి కొన్ని ద్రవ ఆహారాలను ఇవ్వడం మర్చిపోకూడదు. ఇది పసిపిల్లల్లో ప్రేగు కదలికలను నియంత్రించటానికి ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది.

2. ప్రేగులను క్లియర్ చేయండి

పసిపిల్లల్లో మలబద్ధకం చికిత్స కొరకు మరియు మలం సున్నితత్వానికి వీరేచనాల మందును కూడా ఇవ్వవచ్చు. దీనిని మలం సున్నితత్వానికి సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించవచ్చు. అయితే మంచి ఫలితాల కోసం పీడియాట్రిషిన్ సలహా తీసుకోవాలి. అంతేకాకుండా మీరు చాలా ప్రారంభంలోనే మలం సున్నితం చేయటానికి జాగ్రత్తలు తీసుకోవాలి.

3. శారీరక శ్రమ

ఆరోగ్య నిర్వహణ విషయానికి వస్తే శారీరక శ్రమ అనేది ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది. పసిపిల్లల్లో శారీరక కార్యకలాపాలకు మినహాయింపు లేదు. పిల్లలు ప్రతి రోజు వ్యాయామం చేయవలసిన అవసరం ఉంది. పిల్లలు ప్రతి రోజు కనీసం 60 నిమిషాల పాటు శారీరక కార్యకలాపాలు చేయాలి. అప్పుడు ప్రేగు కదలికలను నియంత్రించటానికి సహాయం చేస్తుంది.

4. మందులు

పిల్లలకు మందులు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా స్పెషలిస్ట్ సలహా తీసుకోవాలి. ఇచ్చిన మందులను పరిశిలించాలి. ఒకవేళ ఇచ్చిన మందులు మలబద్ధకం కలిగిస్తుంటే కనుక మీరు వెంటనే నిలిపివేయటం ఉత్తమం. అంతేకాకుండా మీరు మందులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో అని ప్రారంభంలోనే గమనించి దానిని తప్పించడానికి చర్యలు తీసుకోవాలి. ఇది పసిపిల్లల్లో మలబద్ధకం చికిత్సకు ఉత్తమమైన మార్గం అని చెప్పవచ్చు.

5. క్రమశిక్షణ

చిన్న క్రమశిక్షణ మేజిక్ చేస్తుంది. పిల్లలకు క్రమం తప్పకుండా టాయిలెట్ సమయాన్ని ఫిక్స్ చేయండి. పిల్లవాడు ప్రతి రోజు అదే సమయంలో టాయిలెట్ వెళ్ళుతున్నాడని నిర్ధారించుకోండి.ఇది " బాత్రూమ్ సమయం" అని పిల్లలకు చెప్పటం ఉత్తమం.పిల్లలకు ఒక క్రమశిక్షణ అలవాటు చేయటం మంచిది.

పైన చెప్పిన అన్ని విధానాలను పాటిస్తే ఖచ్చితంగా పసిపిల్లలకు మలబద్ధకం చికిత్స కు మంచి మార్గం అని చెప్పవచ్చు.

మీరు అన్ని ఫలితాలు మరియు విధానాలను మిళితం చేయాలి. అయినప్పటికీ చిన్నప్పుడు ఫైబర్ తక్కువ తీసుకోవటం వలన మలం సున్నితం చేయటానికి ప్రభావం వుండదు. మరోవైపు శారీరక శ్రమ లేకపోవడం మరియు అధిక ఫైబర్ ఆహారం మరియు మలం సున్నితం చేయటానికి అవసరమైన ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు పసిపిల్లల్లో మలబద్ధకం నివారించడానికి ఈ ప్రయత్నాలను చేయటం మంచిది.

Story first published: Sunday, November 24, 2013, 16:29 [IST]
Desktop Bottom Promotion