Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పుట్టించింది ఎవరు? అతని చరిత్ర ఏమిటి?

వీర్య దానం అంటే, పిల్లలు లేని లేదా పిల్లలు పుట్టని జంటలకు గర్భం ధరించటానికి వీర్యాన్ని దానం చేయటంగా చెప్పాలి. వైద్యుల సహాయంతో ఆరోగ్యకరమైన వీర్యకణాలను మహిళ గర్భవతి అవటానికి ఆమె గర్భంలో ప్రవేశ పెడతారు. వీర్య కణాల బ్యాంకులు దాతలనుండి వీర్యాన్ని తీసుకుని నిలువ వుంచుతాయి. ఈ వీర్యకణాలను జంటలు పొందేటపుడు, వారు ఆ వీర్య దాతల ఆరోగ్యం మరియు చరిత్ర వంటి రికార్డులను తిరగేసి ఎంపిక చేసుకోవచ్చు. ఈ రకంగా పొందిన వీర్యకణాలు తల్లికి, కడుపులో పిండానికి కూడా హాని కలిగించిన సంఘటనలున్నాయి. కలుషితమైన లేదా నష్టపోయిన వీర్యం మహిళ మరియు బేబీల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. మీరు కనుక వీర్య దాతలవద్దకు వెళుతూంటే, ఈ అంశాలు పరిశీలించండి.
మీ డాక్టర్ ను సంప్రదించండి - వీర్యం ఇచ్చే సెంటర్ కు వెళ్ళేముందు, మీ గైనకాలజిస్టు ను సంప్రదించండి. ఎన్నో సంవత్సరాలనుండి గర్భం ధరించటంలో విఫలం అవుతూంటే, గైనకాలజిస్టును సంప్రదించకుండా నిర్ణయం చేయకండి. డాక్టర్ మీ పార్టనర్ కి తక్కువ వీర్య కణాల సంఖ్య వున్నదని లేదా వ్యాధులనుండి బాధపడుతున్నాడని చెపితే తప్ప ఒక నిర్ణయానికి రాకండి.
సరైన వీర్యకణాల బ్యాంకును ఎంపిక చేసుకోండి - గర్భం ధరించలేని జంటలకు వీర్యకణాల దానం నేడు ఒక పెద్ద సమస్య అవుతోంది. ప్రకటనలు చూసి మోసపోకండి. అధీకృత, ఆరోగ్యకరమైన వీర్య కణాల బ్యాంకు మీకు మంచి నాణ్యతగల వీర్యాన్ని అందిస్తుంది. ఫలదీకరణ కూడా తగిన అర్హతలుకల నిపుణులతో చేయించండి. సర్టిఫై చేసిన వీర్యకణాల బ్యాంకులు సురక్షితమని గ్రహించండి.
డోనర్ రికార్డులు పరిశీలించండి. - స్పెర్మ్ డోనర్ వద్దకు వెళ్ళేముందు, అతనికి సంబంధించిన ప్రధాన రికార్డులు పరిశీలించాలి. స్పెర్మ్ బ్యాంకుల వద్ద వీరికి సంబంధించిన వివరాలుంటాయి. కనీసం అతని మూడు నుండి 7 తరాల వరకు తల్లి, తండ్రి వైపు వారి చరిత్ర వుంటుంది. స్పెర్మ్ బ్యాంక్ డోనర్ శరీరాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించి వీర్యాన్ని తీసుకుంటుంది. అతనికి కనుక ఏవైనా వ్యాధులు, ప్రత్యేకించి సుఖ వ్యాధులవంటివి వుంటే తిరస్కరిస్తుంది. తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఒక మంచి బ్యాంకు చేపట్టే చర్యలలో ఇది ప్రధానమైంది.
రక్తం గ్రూపులను కూడా పరిశీలించాలి - గర్భం ధరించాలంటే, బ్లడ్ గ్రూపులు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. రక్తంలోని ఆర్ హెచ్ లేదా రీసస్ ఫ్యాక్టర్ అనేది ఒక రకం ప్రొటీన్. దీనితో ఒక నెగెటివ్ గ్రూప్ రక్తం కనుక వచ్చి చేరితే, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధ దానిని ఒక ఫారిన్ బాడీ అంటే తనకు తెలియనిదానిగా చూస్తుంది. వెంటనే యాంటీ బడీలను తయారు చేసి దానితో పోరాడుతుంది. ఫలితంగా గర్భ విచ్ఛిన్నం అవుతుంది. కనుక ముందుగానే స్పెర్మ్ డోనర్ యొక్క బ్లడ్ గ్రూప్ ఏదో తెలుసుకోవాలి.
మీరు సరిగా దానితో వ్యవహరిస్తున్నంతవరకు వీర్యదానం అనేది అపాయకరం కాదు. సర్టిఫై చేసిన ఒక మంచి స్పెర్మ్ బ్యాంక్ నుండి పొందిన ఒక మంచి వీర్యదాత వీర్యంతో గర్భం ధరించటం ఏమీ అపాయకరం కాదు.



Click it and Unblock the Notifications