Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
గర్భాధారణకు అనుకూలమైన వయస్సు ఏది...!?

18 సంవత్సరాలకు ఆడవాళ్లు మైనర్ తీరుతారు. పెళ్లికి అర్హులవుతారు. అంతమాత్రానా గర్భధారణకు మాత్రం సరైన సమయం కాదు. తల్లికావడానికి 18 సంవత్సరాలు చాలా లేత వయస్సు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పెళ్లి 18 ఏళ్లకు అయినా, గర్భధారణ మరి కొంత కాలం వాయిదా వేసుకోవాలి. ఎంతకాలం అనేది మీ ఆరోగ్యం మీదా, మీ కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. లేత వయసులో పుట్టే బిడ్డలు బలహీనంగా ఉంటారు. ఒక్కోసారి నెలలు నిండక ముందే కాన్పు కావచ్చు. మీ ఆరోగ్యానికి ప్రమాదంగా కూడా పరిణమించొచ్చు.
ఏ వయస్సులోనైనా గర్భదారణ ఛాలెంజ్‌గానే వుంటుంది. గర్భదారణకు అవకాశమైన, సంతోషపూరిత సమయం ఏదీ అనుకుంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా భార్యాభర్తలు సిద్ధంగా వుండడమే. శారీరక రీత్యా చూస్తే గర్భదారణకు 20-25 సంవత్సరాల మధ్య వయస్సు అనువైనది.
ఈ వయస్సులో ఫెర్టిలిటీ ఉత్తమంగా ఉంటుంది. మహిళలు సాధారణంగా ఈ వయస్సులో ఆరోగ్యంగా వుంటారు. గర్భ సంబంధింత సమస్యలు ఈ వయస్సులో సాధారణంగా తలెత్తవు. బిడ్డ టీనేజ్‌కు వచ్చేసరికి వయస్సు ఎక్కువ గల తల్లిదండ్రులు కంటే ఈ వయస్సులో వారు అధిక శక్తితో ఉంటారు.
ముప్పైలలోకి అడుగు పెట్టేకొద్ది వారి ఫెర్టిలిటీ శాతం తగ్గడం ఆరంభిస్తుంది. ముప్పైనలభైల మధ్యకు వచ్చే సరికి గర్భం దాల్చడం క్లిష్టంమవుతుంది. 35 సంవత్సరాలు దాటిన వారికి గర్భస్రావాలు, పుట్టుక లోపాలు ఎక్కువవుతాయి. డయాబెటిస్ (గర్భధారణలో వచ్చేది) హైపర్ టెన్షన్, సమయం కంటే ముందే ప్రసవాలు వంటి సమస్యల శాతం కూడా పెరుగుతుంది. 35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భధారణ ప్రమాదకరం. మీ ఆరోగ్యం పాడవడంతోపాటు, చిన్నారి అంగవైకల్యంతో పుట్టవచ్చు.
అయితే, వైద్యశాస్త్ర పురోగతి దృష్ట్యా సరైన చికిత్సలు... జాగ్రత్తల వల్ల ఈ సమస్యల్ని అధిగమించవచ్చు. వయస్సు సంగతిని పక్కన వుంచితే, గర్భధారణకి ఆరోగ్యంగా వుండటమన్నది ప్రధానం. సంపూర్ణ ఆరోగ్యంతో వున్నట్టయితే ఏ వయస్సులోనైనా గర్భం దాల్చవచ్చు. ఎవరికివారు తమ అవకాశాలు, అవసరాల్ని దృష్టిలో వుంచుకుని ప్లాన్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
