Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
అబార్షన్ తర్వాత త్వరగా కోలుకోవాలంటే?

1. ఆహారంలో ప్రొటీన్లు అధికంగా వుండాలి. విటమిన్లు, ఇతర ఖనిజ లవణాలు వుండాలి. దీనివలన రక్తహీనత లేకుండా సరైన పోషకాలు శరీరానికి అందుతాయి.
2. అబార్షన్ తర్వాత తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లనైన, లేక ఆయిల్ అధికంగా వున్న ఆహార పదార్ధాలు తినరాదు. ముల్లంగి, కాకర కాయ, ఆరెంజ్ మొదలైనవి తినవద్దు. తాజా పండ్లను తినాలి.
3. చేపలు, మెత్తటి కోడి మాంసం, గుడ్లు, జంతువుల లివర్, మాంసం, సోయాబీన్, పాలు, ఖర్జూరాలు, తాజా కూరగాయలు, పచ్చని ఆకు కూరలు మొదలైనవి ఆహారంలో వుండాలి.
4. అబార్షన్ తర్వాత చెమట అధికంగా పడుతుంది. కనుక ప్రతిరోజూ 8 నుండి 12 గ్లాసుల నీరు తప్పక తాగండి. ఇది మీ శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడటమే కాక, మలబద్ధకాన్నికూడా నివారిస్తుంది. జీర్ణ వ్యవస్ధ శుభ్రపడుతుంది.
5. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు అధికంగా వుంటే రక్తంలోని ఎర్రకణాలు అధికమవుతాయి. గుడ్లు, చేప, ఉడికించిన బీన్స్, అరటిపండు, అవకాడో, కేరట్, ఛీజ్, బఠానీ, ఆరెంజి, పచ్చని ఆకు కూరలు, బాదం పప్పు మొదలైనవి ప్రొటీన్ అధికంగా వుండే పదార్ధాలు తినాలి.
6. మాంసాహారులైతే, చేప, షెల్ ఫిస్, గునా, బీఫ్, పోర్క్, చికెన్, ల్యాంబ్, ఉడికించిన బీన్స్, బఠాణీలు ప్రొటీన్ అందిస్తాయి. వీరికి ఐరన్ మరియు బి బిటమిన్లు కూడా కావాలి.
7. తక్కువ కొవ్వు కల పాల ఉత్పత్తులు కాల్షియం అధికంగా ఇస్తాయి. పాల ఉత్పత్తులు ప్రొటీన్లను, విటమిన్లను కూడా ఇస్తాయి.
8. నూనెలు, మసాలాలు వుండే ఘాటైన పదార్ధాలు తినవద్దు. ఈ ఆహారాలు సున్నితంగా, బలహీనంగా వున్న జీర్ణ వ్యవస్ధను దిగజారుస్తాయి. మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో చికెన్ లేదా గుడ్లు తింటే మంచిది.
అబార్షన్ అయిన తర్వాత కలిగే బలహీనతనుండి బయటపడాలంటే పై చిట్కాలు పాటిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మహిళ మరోమారు తన పూర్వపు శారీరక ఆరోగ్యాన్ని పొందే అవకాశం వుంటుంది.



Click it and Unblock the Notifications
