Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
పిల్లలు పుట్టాలంటే రతి ఎపుడు? ఎలా?

గర్భవతి త్వరగా అవ్వాలంటే, ఫలదీకరణ జరిగే ఈ ఆరు రోజులలో రతిక్రీడ ఆచరించాలి. ప్రతి రుతుక్రమంలోను 5 నుండి 6 రోజులు మాత్రమే అందుకు అనుకూలంగా వుంటాయి. ఈ సమయానికి ముందుగా లేదా ఈ సమయం అయిపోయిన తర్వాత కనుక రతిక్రీడ ఆచరించినప్పటికి గర్భం వచ్చే అవకాశం లేదు.
అండోత్సర్గం అంటే అండం విడుదల అయిన ఒకటి లేదా రెండు రోజులలోనే రతి చేయాలి. అండం విడుదల ఎల్లపుడూ ఒకే రకంగా వుండదు. మహిళలు తమ రుతుక్రమ సైకిల్ ను ఖచ్చితంగా ఆచరించలేరు. కనుక అండం విడుదల అయిన మూడవ రోజు రతి ఫలితాలనివ్వదు. మహిళల రుతుక్రమంలో అండం ఏ సమయంలో అయినా రిలీజ్ కావచ్చు.
అండం విడుదలను సూచించే కిట్ లు నేడు మార్కెట్ లో లభ్యంగా వున్నాయి. అవి పాజిటివ్ సూచించేటంతవరకు వుంటే, అప్పటికే మీలో అండం విడుదల జరిగిపోయి అవకాశాలు తక్కువగా వుంటాయి. మరి శరీర ఉష్ణోగ్రత అధికమయ్యే వరకు కూడా వేచి వుండకండి. అండం విడుదలైన మూడోరోజున కాని శరీర ఉష్ణోగ్రత అధికం అవదు.
ఈ ఫలదీకరణ సమయంలో ఎంత తరచుగా రతి చేయాలి? ఫలదీకరణ జరిగే రోజులలో గతంలో రోజు విడిచి రోజు చేయాలనేవారు. కాని స్టడీల మేరకు మీరు కనుక ప్రతిరోజూ రతిని ఆచరించినట్లయితే, అతని వీర్యకణాల సంఖ్య సరైన రీతిలో వుంటే, ఈ ఫలదీకరణ జరిగే 4 లేదా 5 రోజులు, మరియు అండం విడుదల అయ్యే రోజు రతి చేయాలి. అయితే ఆ సమయంలో పురుషుడికి కనుక వీర్యం సరిగా లేకుంటే, గతంలో చెప్పినట్లు, రోజు విడిచి రోజు చేస్తే కూడా మహిళ గర్భం ధరించే అవకాశానికి సరిపోతుంది. గర్భం రావాలని ప్రయత్నించే జంటలు రెగ్యులర్ గా వారానికి రెండు లేదా మూడు సార్లు రతిలో పాల్గొనాలి. ఎందుకంటే, మీలో అండం విడుదల ఎపుడు జరుగుతుందో తెలియదు కనుక.
ఫలదీకరణ జరిగే రోజులలో ప్రతిరోజూ చేస్తే 37 శాతం, రోజు విడిచి రోజు చేస్తే 33 శాతం, ఒకే సారికనుక చేస్తే 15 శాతంగా మహిళ గర్భం ధరించే అవకాశాలుంటాయని రీసెర్చి చెపుతోంది. మహిళ గర్భం ధరించాలంటే, పురుషుడిలో వీర్యం కూడా తగినంతగా వుండాలి. తగినన్ని వీర్య కణాలుండాలి. అపుడే గర్భం ధరించటం సాధ్యం అవుతుంది. కొన్ని మార్లు ప్రతిరోజూ రతి ఆచరించటం వలన తగినంత వీర్యం లేక గర్భం ధరించే అవకాశం వుండదు. కనుక ఫలదీకరణ రోజులలో పురుషుడు కూడా వీర్యాన్ని పొదుపుగా వాడుకోవాలి.



Click it and Unblock the Notifications
