Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
సహజంగా గర్భం పొందడానికి సహాయపడే సూపర్ ఫుడ్స్
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరీ ఆరోగ్యమీద ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్త్రీలు, ఆరోగ్యంగా ఉండటానికి మరియు ఆరోగ్యంగా బరువు తగ్గించుకోవడానికి వారి హెల్తీ డైట్ లో కూరగాయలు, వెజిటేబుల్ ఆయిల్, చేపలు మరియు బీన్స్ వంటి హెల్తీ ఆహారాలు త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి. ఆరోగ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, బరువును కంట్రోల్లో ఉంచుకుంటారో అటువంటి వారు మంచి ఫ్యామీలీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారని భావించవచ్చు.
కొన్ని పరిశోధనల ప్రకారం, ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ను తగ్గించి మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కలిగిన అవొకాడో, మరియు ఆలివ్ ఆయిల్ వంటి వాటిని తీసుకోవడం వల్ల వంద్యత్వంతో బాధపడుతున్న మహిళులు గర్భపొందడానికి ఈ ఫుడ్స్ సహాయపడుతాయి.
వంద్యత్వంతో పోరాడే ఆహారాలను తీసుకోవడం వల్ల మహిళలు గర్భం పొందే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా అనిమల్ ప్రోటీన్స్ బదులుగా, వెజిటేబుల్ ప్రోటీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇటువంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. నేచురల్ గా తీసుకొనే ఆహారాలతో కూడా సంతానభాగ్యంను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలో ఐరన్, క్యాల్షియం, మరియు మెగ్నీషియం వంటి ఆహారాలు గర్భం పొందాలని కోరుకొనే మహిళకు ఎక్కువ అవసరం అవుతాయి. కాబట్టి, ఈ పోషకాంశాలున్న ఆహారాలను ఎంపిక చేసుకొని మరీ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
ఫెర్టిలిటి స్థాయిలను పెంచుకోవడానికి కొన్ని బూస్టింగ్ ఫుడ్స్ మీకోసం ఈ క్రింది విధంగా....

అరటి పండ్లు:
నేచురల్ గా గర్భం పొందడానికి సహాయపడే ఒక ముఖ్యమైన విటమన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ హార్మోనులను రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతాయి.

ఆస్పరాగస్:
అండోత్సర్గ వైఫల్యంను ఫోలిక్ యాసిడ్ నిరోధిస్తుందనిక కొన్ని పరిశోధనలు నిరూపించబడ్డాయి. కాబట్టి, ఆస్పరాగస్ లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ ఫెర్టిలిటి ఫుడ్ గా తీసుకోవచ్చు.

గుడ్డు:
గుడ్డు ఆరోగ్యానికే కాదు, వంధ్యత్వాన్నిఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఫెర్టిలిటిని పెంపొందించే సూపర్ ఫుడ్స్ లో ఇది కూడా ఒకటి. గుడ్డులోని ఉండే క్యాల్షియం గర్భాధారణ పొందడానికి బాగా సహాయపడుతుంది.

బాదం:
కొన్ని పరిశోధనల ప్రాకరం విటమిన్ ఇ స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో బాగా సహాయపడుతుందని చాలా పరిశోధనలు నిరూపించబడ్డాయి. ఈ సూపర్ ఫుడ్ లో కూడా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది స్పెర్మ్ మరియు అండం యొక్క డిఎన్ ఎ కు రక్షణ కల్పిస్తుంది.

ఆరెంజ్ :
మహిళల్లో హార్మోనుల అసమతుల్యతను క్రమబద్ద చేసే విటమిన్స్ సిట్రస్ ఫ్రూట్స్ లో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, వంద్యత్వంతో బాధపడుతున్న మహిలకు ఒక ఉత్తమ ఆహారం ఆరెంజ్ మరియు నిమ్మ.

టోఫు:
టోఫును ప్రతి ఒక్కరూ ఇష్టపడరు. కానీ ఇది నేచురల్ గా గర్భం పొందడానికి సహాయపడే ఒక ఉత్తమ ఫెర్టిలిటి ఫుడ్. ఒక సర్వింగ్ టోఫు ఫుడ్ ఐటమ్ లో 500grms ఐరన్ కలిగి ఉంటుంది.

సాల్మన్:
సాల్మన్ లో ఉన్న మినిరల్స్ యాంటీఆక్సిడెంట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రీరాడికల్స్ నుండి ఎగ్ మరియు స్పెర్మ్ కు రక్షణ కల్పిస్తుంది. అందువల్లే, గర్భం పొందాలని కోరుకొనే వారు సాల్మన్ ఫిష్ ను తీసుకోవాలి.

పచ్చిబఠానీ:
ఫెర్టిలిటీని నేచురల్ గా జరిగేలా చేసే సూపర్ ఫుడ్స్ లో పచ్చిబఠానీ కూడా ఒకటి. ఇది వంద్యత్వంతో బాధపడే పురుషుల్లో జింక్ లెవల్స్ ను పెంపొందిస్తుంది. అలాగే వీర్యకణాలను కూడా పెంచుతుంది.



Click it and Unblock the Notifications