Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
తల్లి ద్వారా కడుపులోని బిడ్డకు హాని కలిగించే అంశాలు
మహిళలలో జీవితంలో గర్భధారణ చాలా ముఖ్యమైన, మంచి అనుభవం. ప్రతి మహిళ తల్లి కావాలని, బిడ్డను మోయాలని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుంది. ఆడవాళ్లు గర్భం దాల్చిన దగ్గర నుంచి.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని తన ఆరోగ్యం, కడుపులోని బిడ్డ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచిస్తారు.
కడుపులోని బిడ్డకు హాని కలిగించే ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. ఆల్కహాల్, స్మోకింగ్, చీజ్ వంటివాటికి దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఈ మూడింటి వల్ల గర్భస్త శిశువు ఎదుగుదలపై దుష్ర్పభావం చూపిస్తాయి.
అలాగే సరైన డైట్, యాక్టివ్ గా ఉండటం వంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి.
కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీ ద్వారా బిడ్డకు హాని కలిగే కొన్ని విషయాలున్నాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం వల్ల గర్భంలోని బిడ్డ ఆరోగ్యంతోపాటు, తల్లి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. తల్లి కడుపులోని బిడ్డపై దుష్ర్ఫభావం చూపే అంశాలేంటో చూద్దాం..

కాలుష్యం
గర్భిణీ స్త్రీ ఎక్కువ సమయం కాలుష్యంలో గడపడం వల్ల తక్కువ బరువుతో బిడ్డ పుట్టే రిస్క్ ఉందని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ప్రాసెస్డ్ మీట్
ప్రాసెస్డ్ మీట్ లేదా మాంసం తీసుకోవడం గర్భిణీలకు చాలా ప్రమాదకరం. ఈ మాంసాహారాల్లో లిస్టేరియా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల సమయానికి కంటే ముందు డెలివరీ అవడం, లేద కడుపులోని బిడ్డకు ఇన్ఫెక్షన్ అవడం జరుగుతుంది.

విటమిన్ డి
సూర్య కిరణాల ద్వారా విటమిన్ డి పొందడం చాలా అవసరం. గర్భిణీ స్త్రీల్లో విటమిన్ డి లోపిస్తే.. డయాబెటిస్, ప్రీ ఎక్లంప్సియా, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

యాంటీ డిప్రెజంట్స్
ఎమోషన్స్ నుంచి బయటపడటానికి చాలామంది గర్భిణీ స్త్రీలు.. యాంటీ డిప్రెజంట్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ అబార్షన్ అవడానికి కారణమవుతాయి. అలాగే బర్త్ డిఫెక్ట్స్, ముందుగానే డెలివరీ అవడం, ప్రవర్తన సమస్యలు వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తే
డైరెక్ట్ గా స్మోకింగ్ చేయడం కంటే.. పక్కనవాళ్లు స్మోకింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రమాదకరం. గర్భిణీ స్త్రీలు స్మోకింగ్ చేయడం వల్ల.. గర్భంలోని శిశువుకి ప్రమాదం. అలాగే ఇతరులు స్మోకింగ్ చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు బిడ్డలో వచ్చే అవకాశాలున్నాయి.

కాఫీ
గర్భిణీ స్త్రీలు కాఫీ తాగడం అత్యంత ప్రమాదకరం. కెఫీన్ కడుపులోని బిడ్డపై తీవ్ర దుష్ర్పభావం చూపుతుంది.

బరువు ఎక్కువగా ఉండటం
గర్భిణీ స్త్రీలు ఎక్కువ బరువు ఉంటే.. పుట్టబోయే బిడ్డకు ఆస్తమా రిస్క్ ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు ఎక్కువగా ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల హెల్తీ బేబీకి జన్మనివ్వగలదో తెలుసుకోవాలి.



Click it and Unblock the Notifications