Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
Phone Addiction : పిల్లలు ఫోన్ వాడకం తగ్గించాలంటే ఇలా చేయండి..స్క్రీన్ టైం ఎక్కువైతే ప్రమాదం..
ఇప్పుడు చేతిలో ఫోన్‌లేనిదే ఏ పనులూ పూర్తి కాని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ పరిస్థితి చాలా అనర్ధాలకు కూడా దారి తీస్తోంది. పసిపిల్లలు కూడా ఈ ఫోన్‌కు అలవాటు పడ్డం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లల చిన్ని చిన్ని కళ్లు గంటల తరబడి ఫోన్ స్క్రీన్ చూడ్డం వల్ల దెబ్బ తింటున్నాయ్. చిన్న వయసులో కళ్లద్దాలు వస్తున్నాయ్. ఇలా ఫోన్‌కు అలవాటు పడ్డం వల్ల యాంక్జైటీకి గురౌతున్నారు. పిల్లలను ఈ ఫోన్ అడిక్షన్ నుంచి ఎలా కాపాడాలి. పిల్లలు ఫోన్ వాడకం తగ్గేలా ఏం చేయాలో తెలుసుకుందాం.
పిల్లలు స్క్రీన్ టైం తగ్గించకపోతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు
చిన్న వయసులోనే ఫోన్ వాడకాన్ని తగ్గించేలా చేయకపోతే భవిష్యత్తులో దారుణ పరిస్థితులు ఎదురుకావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగిన పరీక్షల ప్రకారం.. చిన్న వయసులోనే ఫోన్ వాడకం ఎక్కువ ఉన్నవారు 18 నుంచి 24 ఏళ్ల వయసు వచ్చే సరికి తీవ్రమైన మానసిక సమస్యలతో సతమతమయ్యారని నిర్ధారనైంది. ఫోన్ వాడకం ఎక్కువవడం వల్ల కంటి సమస్యలు, మానసిక సమస్యలు, కమ్యునికేషన్ స్కిల్స్, నిద్రసమస్యలు, పట్టుదల కోల్పోవడం వంటివి జరుగుతాయని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్‌ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం
ఫోన్లో పిల్లలు ఎక్కువగా కార్టూన్లు చూడ్డం, వీడియో గేమ్స్ ఆడటం, సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ చాలా సమయం గుడిపేస్తుంటారు. ఈ స్క్రీన్ టైంను చదువుకు జోడించి ఉపయోగించుకోవాలని తల్లిదండ్రలకు వైద్యులు సూచిస్తున్నారు.
ఫోన్లో వీడియోగేమ్స్‌కి బదులుగా సుడోకో లాంటి పజిల్లు ఆడడం, డాక్యుమెంటరీలు చేయించడం, ఆన్‌లైన్ క్విజ్ పోటీల్లో పాల్గొనేలా చేయడం తల్లిదండ్రులు చేయించాలంటున్నారు. ఇలా చేస్తే పిల్లల్లో ఏకాగ్రత, భావోద్వేగాలను తట్టుకునే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
మానసిక వైద్య నిపుణుల సూచనలు
ఫోన్లో అనవసర వాటిని ఎక్కువసేపు చూడ్డం వల్ల కలిగే అనార్ధాల గురించి పిల్లలతో ఓపెన్‌గా చర్చించాలంటున్నారు. దాని వల్ల కలిగే దుష్ఫ్రభావాలను వారికి నేరుగా చెబితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
ఇంటర్నెట్, ఫోన్ వాడకం ఎక్కవైన తరువాత పిల్లలు అవుట్ డోర్ పిక్‌నిక్‌లకు వెళ్లడం తగ్గింది. కనీసం వారానికి ఒకసారైనా పిల్లలను అవుట్‌డోర్‌కు తీసుకువెళ్లడం, ప్రకృతితో కలిసేలా చేయడం చేయాలి. వాటర్ ఫాల్స్,అడవులు, రకరకాల జంతువులు, నదులు, సముద్రం, చేపలను వీరికి చూపించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మానసికంగా దెబ్బతినకుండా సహజంగా బలంగా చురుకుగా తయారవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
