Latest Updates
-
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.!
పాలు అంటే.... అయిష్టమా...?

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత, సాయంత్రం పండ్లతో పాటుగా ప్రతిరోజూ రెండు సార్లు పిల్లలకు పాలు తాగే అలవాటు చేయండి. పాలు మంచి రుచిగా వుంటే పిల్లలు ఇష్టపడతారు. మొదటగా వీలైనంతవరకు రుచికొరకు పాలలో ఏమీ కలపకుండానే ఇవ్వండి. ఇక పిల్లలు మొండికేస్తే అపుడు ప్రత్యామ్నాయం ఆలోచించండి. కొంతమందికి పాల వాసన గిట్టదు. పాలను ఫ్రిజ్ లో వుంచండి. అయితే, చల్లని పాలు బిడ్డకు ఇవ్వకండి. దగ్గు, జలుబులు వచ్చే అవకాశం వుంది. చల్లని ఫ్లేవర్డ్ మిల్క్ బాగానే వుంటాయి.
పండ్లు, రైస్ లేదా సిరప్ లతో పాలు తాగటానికి పిల్లలు ఇష్టపడతారు. కొద్ది పాలు, ఉడికిన అన్నం కలిపి పెట్టండి. ఆపిల్ లేదా స్ట్రాబెనర్రీలు రుచి కొరకు దానిలో కలపచ్చు. పాలంటే ఇష్టపడని పిల్లలకు బాదం పాలు ఇవ్వండి. వాటిలోని బాదం పప్పులు నమలటం వారికి ఇష్టంగా వుంటుంది. రుచి మార్చటానికి అపుడపుడు కొద్దిగా కుంకం పూవు కూడా వాటిలో వేయండి. సోయామిల్క్ లో కూడా కావలసినన్ని ప్రొటీన్లు, విటమిన్లు వుంటాయి.
చివరి అస్త్రంగా, పాలు తాగని పిల్లలకు, వారి ముక్కు మూసి నోట్లో పోసేస్తే తేలికగా పొట్టలోకి వెళ్ళిపోతాయి. ఇక ముక్కుకు పాల ప్రభావం వుండదు. బ్రెడ్, బిస్కట్లు వంటివి పాలలో నానబెట్టి, ఆ మిశ్రమంలో పండ్లు ముక్కలు వేసి, ఆకర్షణీయంగా ఒక చెర్రీ పెట్టి రుచికర తిండిగా ఇవ్వండి. అంతే ఆ డిష్ చూస్తే మీ పిల్లలు తినకుండా వుండలేరు.



Click it and Unblock the Notifications
