Latest Updates
-
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి
పిల్లల తిండికి వంటలు చేసే తండ్రులకు చిట్కాలు!
పిల్లల తిండికి వంటలు చేసే తండ్రులకు చిట్కాలు!
పిల్లాడిని పెంచాల్సిన భాధ్యత తల్లిదే కాదు. తండ్రికి కూడా సమానంగా వుంటుంది. ఉద్యోగాలు చేసే తల్లులుంటే... ప్రతి బిడ్డ పెంపకం తండ్రి కూడా ఎంతో కొంతమేర చేయాల్సిందే. మహిళలు కుటుంబాన్ని ఉద్యోగాన్ని బ్యాలన్స్ చేసుకురావటంలో సమర్ధులే. అయినప్పటికి తల్లి ఊరిలో లేనపుడో లేక ఉద్యోగానికి వెళ్ళినపుడో ఏదో ఒక సమయంలో తండ్రులు కూడా పిల్లలకు వంట చేయాల్సిన పరిస్ధితి వస్తూంటుంది. అందుకుగాను తండ్రులు తేలికగా పిల్లలకు వంట చేసి పెట్టేయగల చిట్కాలు పరిశీలించండి.

1. మీ భార్య ఊరుకు వెళ్ళేముందే ఆమెతో కలసి వెళ్ళి కిరాణా సరుకులు కొని స్టాక్ పెట్టుకోండి. ఆమె ఇంకా ఎక్కువ రోజులు బయటే వుంటే అదే జాబితాను మరల రిపీట్ చేయండి.
2. అవసరమనుకుంటే బయట రెడీ గా వుండే కర్రీ సెంటర్లలో వండిన కూరలు కొని వాటిని వేడి చేసి పిల్లాడికి తినిపించండి. దీనితో పాటు గోధుమ బ్రెడ్, పాలు వంటివి కూడా వుంటే పిల్లలకు సంపూర్ణ ఆహారం ఇచ్చినట్లే.
3. గుడ్లు వండటం తేలిక. వీటిలో అధికమైన ప్రొటీన్లు కూడా వుంటాయి. గుడ్డు ఉడికించి దానిపై పెప్పర్, సాల్ట్ వేసి లేదా గుడ్డుతో ఆమ్లెట్ వేసి పిల్లాడికి ఇచ్చేయండి. దీనితోపాటు ఒక్క గ్లాసెడు తాజా నారింజ రసం ఇచ్చేస్తే పిల్లలు ఎంతో ఇష్టపడతారు.
4. రెడీగా వుండే ఏ ఆహార వస్తువు కొన్నప్పటికి వాటిపై గల లేబుల్స్ చూడండి. ఆ లేబుల్స్ పైనే వాటిని తయారు చేసుకొనే సూచనలు కూడా వుంటాయి. వీటిని ఆచరిస్తే, మీ పిల్లాడికి, మీకు కూడా టేబుల్ వద్ద ప్రతి రోజూ ఆహారం సిద్ధమే.
5. తాజా పండ్లు తినటానికి రెడీగా వుంటాయి. కనుక వాటిని ముక్కలు చేసి వాటిపై క్రీము లేదా తేనె వేసి పిల్లాడికి ఇస్తే స్నాక్స్ లాగా బాగుంటాయి.
6. శాండ్ విచ్ పరిపూర్ణ భోజనమే. దానిలో తాజా కూరలు పెట్టండి. కొద్దిపాటి ఛీజ్ కలిపి స్టవ్ పై వేడి చేసి కూడా ఇస్తే ,చాలా బాగుంటుంది. పిల్లలకు హానికరం కూడా కాదు.
7. నేటి రోజుల్లో ఇంటర్నెట్ మనిషికి మంచి మిత్రుడు. మీరు ఏది తెలుసుకోవాలన్నా దానిని ఆశ్రయించవచ్చు. ఎక్కవ శ్రమలేని చిన్నపాటి ఆహార తయారీలు దాని నుండి తెలుసుకోండి. మీ పిల్లలకు వారు ఇష్టపడే రీతిలో వండి పెట్టండి.
ఈ చిన్నిపాటి సలహాలు, తల్లులు దూరంగా వున్నపుడు పిల్లలకు వంటలు చేసే తండ్రులకు బాగా ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications
