Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
చర్మం మెత్తగా వుండాలంటే!

1. పిల్లలు నడవటం మొదలు పెట్టారంటే శరీర భాగాలకు మురికి లేదా గాయాలు అవుతూంటాయి. కనుక వారి చర్మాన్ని ఎప్పటికపుడు శుభ్రంగా వుంచాలి.
2. పిల్లాడికిస్నానం చేయించే ముందు శరీరానికి దట్టంగా నూనె పట్టించి స్నానం చేయించండి. మీరు వాడే సబ్బులు, మొదలైనవి శరీర చర్మం పొడిబారేలా చేస్తాయి.
3. స్నానానికి ముందే టవల్, సోప్, నూనె, నీరు అన్ని సిద్ధం చేసుకోండి. స్నానం సమయంలో పిల్లాడిని ఒంటరిగా వదలకండి.
4. సహజ నూనెలు వుండే పిల్లల సబ్బులను మాత్రమే వాడండి. సబ్బు రాసేటపుడు కండ్లు, నోరు వంటి భాగాలకు చేరకుండా జాగ్రత్త తీసుకోండి.
5. స్నానం తర్వాత కూడా పిల్లల కొరకు తయారు చేసిన క్రీము లేదా నూనె వంటివి శరీరానికి రాయండి. ఆలివ్ లేదా ఆల్మండ్ నూనెలు రాయవచ్చు. వీటితోనే మర్దన చేయవచ్చు.
6. టవల్ తో పొడిగా తుడిచిన తర్వాత పౌడర్ రాయండి. పిల్లాడి టవల్ ఎప్పటికపుడు శుభ్రం చేయండి.
7. డైపర్ ర్యాషెస్ వచ్చే చోట పౌడర్ అధికంగా రాసి ఊరట కలిగించండి.
8. పిల్లాడికి దద్దుర్లు, ఇతర చిన్న గాయాలుంటే వాటిని మెత్తటి గుడ్డతో, వేడినీటితో శుభ్రం చేయండి. ఆయింట్ మెంట్ రాయండి. పిల్లాడు దానిని ముట్టకుండా బ్యాండ్ ఎయిడ్ వేయండి.
9. పిల్లలకు కాటన్ గుడ్డలే సౌకర్యంగా వుంటాయి. పట్టే చెమటను తేలికగా పీల్చి వారు హాయిగా వుండేలా చేస్తాయి. వీరి దుస్తులను వేడి నీటిలో వుతికితే మంచిది.
10. ఎండలోకి వెళ్ళేటపుడు లూజుగా వుండే దుస్తులు వేయాలి. ఎండ అధికంగా తగలకుండా చూడాలి. కొద్ది నిమిషాలయితే, కావలసిన విటమిన్ డి లభిస్తుంది. కాని అధికమైతే చర్మం రంగుమారుతుంది.



Click it and Unblock the Notifications
